BigTV English

Glowing Skin Tips: మీ ఫేస్ అందంగా కనిపించాలా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Glowing Skin Tips: మీ ఫేస్ అందంగా కనిపించాలా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Glowing Skin Tips:  ముఖం అందంగా కనిపించాలని అందరూ అనుకుంటారు. అయితే ముఖం జిడ్డుగా మారినప్పుడు ముఖం అందం కోల్పోతుంది. ఇలాంటి సమయంలో కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హోం రెమెడీస్ చాలా ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి. అందుకే ఇంట్లోనే కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకుని వాడడం మంచిది. ఇవి ముఖాన్ని అందంగా మారుస్తాయి. అంతే కాకుండా ముఖంపై మొటిమలు కూడా పోతాయి.


ఇంట్లోనే ట్యాన్ తొలగించడానికి ఫేస్ ప్యాక్స్..

1. శనగపిండి, ఆలివ్ ఆయిల్‌తో ఫేస్ ప్యాక్ ..


కావలసినవి:
శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్- 1 టీ స్పూన్
నిమ్మరసం- 2 టీ స్పూన్లు

తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో శనగపిండితో పాటు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం వేసి బాగా కలపాలి. వీటిని బాగా మిక్స్ ముఖానికి పట్టించాలి. ఆ తర్వాత 15 – 20 నిమిషాల పాటు ఉంచి ఆరనివ్వాలి. దీనిని గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం ముఖం అందంగా మారుతుంది.

2.పెరుగు, తేనెతో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పెరుగు- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్ స్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో పెరుగు, తేనెను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఉంచి ఫేస్ శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ తరుచుగా ఉపయోగించడం వల్ల ముఖం పై జిడ్డు తొలగిపోతుంది.

3. టమాటా రసం, శనగపిండితో ఫేస్ ప్యాక్:
కావలసినవి:
టమాటా రసం- 1 టేబుల్ స్పూన్
శనగపిండి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో టమాటా రసం, శనగపిండి వేసి మిక్స్ చేసుకోవాల. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసిన 15- 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అంతే కాకుండా స్కిన్ మెరిసిపోతుంది.

4. దోసకాయ, పాలతో ఫేస్ ప్యాక్..
కావలసినవి:
దోసకాయ పేస్ట్- 1 టేబుల్ స్పూన్
పాలు- 1 టీ స్పూన్

తయారీ విధానం: దోసకాయ పేస్ట్ తో పాటు పాలను ఒక బౌల్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మెరిసిపోతుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Also Read: కొరియన్ స్కిన్ కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

దోసకాయ ఒక అద్భుతమౌన కూలింగ్ ఏజెంట్. ఇది చర్మం పునర్జీవనంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి పుష్కంగా ఉంటుంది.కాబట్టి ఇది ట్యాన్ తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Cancer: వందలో 70 మందికి క్యాన్సర్.. వణికిస్తున్న తాజా అధ్యయనాలు !

Jamun Seeds: నేరేడు గింజలతోనూ లాభాలే.. తెలిస్తే అస్సలు పడేయరు !

Beetroot For Skin: ఫేషియల్స్ అవసరమే లేదు.. పండగ సమయంలో ఇలా చేస్తే మెరిసిపోతారు

Hair Straightener: హెయిర్ స్ట్రెయిట్నర్‌ ఇలా వాడితే.. జుట్టు ఊడటం ఖాయం !

Longevity Youthful Traits: అత్యంత వృద్ధ మహిళ డిఎన్ఏలో షాకింగ్ రహస్యాలు.. ముసలితనంలోనూ యవ్వనంగా

Alum For Dark Circles: మైక్రో ప్లాస్టిక్‌తో ముప్పు.. మెదడు, ఎముకలపై ప్రభావం, పరిశోధనల్లో షాకింగ్ నిజాలు

Alum For Dark Circles: పటికతో డార్క్ సర్కిల్స్‌కి చెక్.. ఒక్కసారి వాడితే బోలెడు బెనిఫిట్స్

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Big Stories

×