Homemade Hair Colour: ప్రస్తుతం చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగు మారిన జుట్టుతో అవస్థలు పడుతున్నారు. అయితే కొంత మంది తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కలర్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు.
ఇవి తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడతాయి. కానీ రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. వీటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో మనం నేచురల్ హెయిర్ కలర్ తయారు చేసుకుని వాడవచ్చు.
మీరు మీ జుట్టుకు ఎలాంటి హాని లేకుండా నల్లగా మారాలంటే ఇంట్లోనే ఈ ప్రత్యేకమైన హెయిర్ కలర్ తయారు చేసుకోండి. జుట్టు మూలాల నుండి తెల్లగా కనిపించినట్లయితే, ఈ హోమ్ మేడ్ హెయిర్ కలర్ అప్లై చేయండి. ఇది రసాయనాలు లేకుండానే జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడటమే కాకుండా జుట్టును సిల్కీగా, మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది.
ఇది జుట్టును నల్లగా మార్చడం ద్వారా తెల్ల జుట్టును దాచడంలో సహాయపడటమే కాకుండా జుట్టును సిల్కీగా, మృదువుగా, బలంగా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి జుట్టు నల్లగా మారడానికి ఇంట్లోనే హెయిర్ కలర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
హెయిర్ కలర్ తయారీ:
కావలసినవి:
పసుపు- 1 టీస్పూన్
నీలిమందు పొడి ( ఇండిగో పౌడ్ )- 6 టీ స్పూన్లు
పెరుగు- 1- 3 స్పూన్లు
మెంతి పొడి- 3 టీ స్పూన్లు
కాఫీ పౌడర్- 1 టేబుల్ స్పూన్
అలోవెరా జెల్- 1 టీ స్పూన్
తయారీ విధానం:
ఇంట్లోనే హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలి ?
ముందుగా నానబెట్టిన మెంతి గింజల పౌడర్‌లో పెరుగు, కలబంద జెల్ వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
-ఇప్పుడు గ్యాస్ పై పాన్ పెట్టి అందులో పసునుతో పాటు ఇండిగో పౌడర్ వేసి పూర్తిగా నల్లబడే వరకు వేయించాలి. ఈ నల్లగా మారిన పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు సిద్ధం చేసుకున్న పెరుగు, అలోవెరా జెల్, మెంతి పేస్ట్‌లో తయారు చేసుకున్న నల్లటి పొడిని వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే ఒక చెంచా కాఫీ పొడిని కూడా కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి.
Also Read: ఎంతటి తెల్లజుట్టు అయినా.. ఇలా చేస్తే క్షణాల్లోనే నల్లగా మారడం ఖాయం
-వెంట్రుకల మూలాల నుంచి తల మొత్తం ఎక్కడెక్కడ తెల్ల జుట్టు ఉందో అక్కడ ఈ కలర్‌ను అప్లై చేయండి.
– హెయిర్ కలర్ అప్లై చేసిన దాదాపు మూడు నుంచి నాలుగు గంటల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును మీరు వాడే షాంపూతో వాష్ చేసుకోండి.
-ఈ హెయిర్ కలర్ వాడటం వల్ల రసాయనాలు లేకుండా జుట్టు అంతా సులభంగా నల్లగా మారుతుంది. దీంతో పాటు, జుట్టు మృదువుగా, షైనీగా తయారవుతుంది.