BigTV English

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Face Serum: నారింజ తొక్కలతో ఫేస్ సీరం.. అందమైన చర్మం మీ సొంతం

Face Serum: మనం తరచుగా ఆరెంజ్ తొక్కలను పారేస్తాము. కానీ వాటిని ఉపయోగించడం ద్వారా కూడా మీరు ఇంట్లోనే ఆరెంజ్ పీల్ ఫేస్ సీరమ్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ సీరమ్‌ను రోజు ఉపయోగించడం వల్ల ముఖానికి అద్భుతమైన గ్లో వస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నారింజ తొక్కల నుండి సీరమ్ ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మనం ఆరెంజ్ తిన్న తర్వాత వాటి తొక్కలను పాడేస్తూ ఉంటాం. కానీ వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిలో చర్మానికి సహాయపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా నివారిస్తుంది. చర్మాన్ని కూడా మెరిసేలా చేస్తుంది.

ఆరెంజ్ పీల్స్ తో ఫేస్ సీరమ్  తయారీ ?
కావలసినవి:


ఎండిన నారింజ తొక్కలు – 10-12
నీరు – 2 కప్పులు
విటమిన్ ఇ క్యాప్సూల్- 1
గ్లిజరిన్ – కొన్ని చుక్కలు
అలోవెరా జెల్ – 1 టీస్పూన్
గాజు సీసా – 1

తయారీ విధానం:
తొక్కలను కడిగి ఆరబెట్టండి – ముందుగా నారింజ తొక్కలను బాగా కడిగి నీడలో ఆరబెట్టండి.

తొక్కలను ఉడకబెట్టండి– బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. దానిలో ఎండిన నారింజ తొక్కలు వేసి 10-15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వండి.

వడపోయండి – నారంజ తొక్కలు ఉడికించిన నీటిని ఫిల్టర్ చేసి శుభ్రమైన గాజు సీసాలో ఉంచండి.

ఇతర పదార్ధాలను కలపండి– విటమిన్ ఇ క్యాప్సూల్‌ను అందులో కలపండి. గ్లిజరిన్, అలోవెరా జెల్ కూడా యాడ్ చేయండి

ఫ్రిజ్‌లో నిల్వ చేయండి – ఈ సీరమ్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి 7-10 రోజులు ఉపయోగించవచ్చు.

ఆరెంజ్ పీల్ ఫేస్ సీరమ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ?

మెరుపును మెరుగుపరుస్తుంది: నారింజ తొక్కలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మాన్ని బిగుతుగా చేస్తుంది: ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. అంతే కాకుండా ముడతలు, ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.

చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: గ్లిజరిన్ , అలోవెరా జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా, మెరిసేలా చేస్తుంది .

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి: నారింజ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడతాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి.

చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది – ఈ సీరం చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది.అంతే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఆరెంజ్ పీల్ ఫేస్ సీరమ్ ఎలా ఉపయోగించాలి  ?

రాత్రి పడుకునే ముందు శుభ్రమైన ముఖంపై ఈ సీరమ్‌ను అప్లై చేయండి.

చేతులతో ముఖంపై మసాజ్ చేయండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ముఖం కడుక్కోవాలి.

Also Read: బొప్పాయితో ముఖంపై మచ్చలు మాయం, అద్భుతమైన మెరుపు

ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి ?

మీకు అలర్జీ ఉంటే ఈ ఫేస్ సీరం దీనిని ఉపయోగించవద్దు.

మీ చర్మం సున్నితంగా ఉంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయించుకోండి.

మరుసటి రోజు ఉదయం సన్‌స్క్రీన్ అప్లై చేయడం మర్చిపోవద్దు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Big Stories

×