Ghee Purity Check: ప్రస్తుతం కల్తీ మాఫియా పెరిగిపోతోంది. మనం ప్రతి రోజు తినే అనేక ఆహార పదార్థాలు చాలా వరకు కల్తీ అవుతున్నాయి. కల్తీ చేసిప పదార్థాలు ఏవో అసలైన పదార్ధాలు ఏవో తెలియని పరిస్థితి నెలకొంది. కానీ కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే కల్తీ వస్తువులను గుర్తించవచ్చు. ప్రస్తుతం అంతా కల్తీ నెయ్యి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. మరి మనం ఈ కల్తీ నెయ్యిని ఇంట్లోనే ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్యూర్, కల్తీ నెయ్యిలు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇలాంటి సమయంలో కల్తీ నెయ్యిని గుర్తించడం ఎంతైనా అవసరం. ముందుగా నెయ్యిని జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే కొనడం మంచిది. స్వచ్చమైన నెయ్యిని గుర్తించడానికి కొనేటప్పుడు కొన్ని టెక్నిక్స్ ఉపయోగించండి.
1. నెయ్యి కల్తీ అయిందా లేదా తెలుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలో నెయ్యిని వేడి చేయండి . అది గోధుమ రంగులోకి మారితే స్వచ్ఛమైన నెయ్యి అని నిర్థారించుకోవాలి. ఒక వేళ పసుపు రంగులోకి మారితే మాత్రం అది కల్తీ నెయ్యి అని గుర్తుంచుకోండి.
2. దేశీ నెయ్యిని గుర్తించడం కోసం ముందుగా కాస్త నెయ్యిలో నాలుగైదు చుక్కల అయోడిన్ కలపండి . అప్పుడు అది నీలి రంగులోకి మారితే అది కల్తీ నెయ్యి అని గుర్తించండి.
3. టీ స్పూన్ నెయ్యిలో ఒక టీ స్పూన్ హైడ్రో క్టోరిక్ ఆమ్లం, ఒక చిటికెడు చెక్కరను కూడా కలపండి అప్పుడు అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ నెయ్యి .
4. మీ అరచేతిలో ఒక చెంచా నెయ్యిని వేయండి. అది స్వతహాగా కరగడం ప్రారంభిస్తే కనక కల్తీ నెయ్యి . ఇదే కాకుండా నెయ్యి గడ్డ కట్టి ఉండి దాని నుంచి ఎలాంటి సువాసన రాకపోతే కూడా అది కల్తీ నెయ్యి అని గుర్తించండి.
5. తెల్ల కాగితం లేదా ఒక ప్లేట్ పై కొద్దిగా నెయ్యిని వేయండి. దానిని కొన్ని గంటల పాటు అలాగే వదిలేయండి. ఒక వేళ కాగితం మీద కనక ఏదైనా మలినాలు ఏర్పడితే అది కల్తీ నెయ్యి అని భావించాలి. స్వచ్చమైన నెయ్యి కాగితంపై వేస్తే ఎలాంటి మురికి మరకలను ఏర్పరచదు.
6. స్పష్టత, ఆకృతి: స్వచ్చమైన నెయ్యి స్పష్టంగా ఉంటుంది. అంతే కాకుండా మృదువుగా ఉంటుంది.
7.బర్న్ టెస్ట్:ఒక పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయండి. అధిక పొగ, కాలిన వాసన రాకుండా ఉండి, త్వరగా కరిగితే అది కల్తీ నెయ్యి.
8. నీటిని కరిగించే పరీక్ష: ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నెయ్యిని కలపండి. స్వచ్చమైన నెయ్యి అయితే త్వరగా నీటిలో కరిగిపోతుంది. అలా కాకుండా నెయ్యి తేలడం కానీ గడ్డకట్టినట్లు అలాగే ఉన్న అది కల్తీ నెయ్యి .
Also Read: పసుపుతో అద్భుతాలు.. ఈ సమస్యలన్నీ దూరం
9. రుచి పరీక్ష: స్వచ్ఛమైన నెయ్యి రుచి వెన్నలాగా ఉంటుంది. కల్తీ నెయ్యి కాస్త చేదుగా అనిపిస్తుంది. అంతే కాకుండా మీ వద్ద ఉన్న నెయ్యిని కొన్ని గంటలపాటు ఫ్రిడ్జ్ లో పెట్టండి. స్వచ్చమైన నెయ్యి గడ్డకడుతుంది. కల్తీ నెయ్యి కడ్డకట్టదు. అంతే కాకుండా పొరలు పొరలుగా మలినాలను ఏర్పరుస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.