BigTV English

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది
Egg Potato Omelette: చిన్నపిల్లలకు టేస్టీ బ్రేక్ ఫాస్ట్ పెడితేనే వారు తింటారు. ఇంట్లో ఒక గుడ్డు, ఒక బంగాళదుంప ఉన్నా చాలు వారికి ఇష్టమైన ఎగ్ పొటాటో ఆమ్లెట్ వేసేయొచ్చు. ఇది రుచి పరంగా, ఆరోగ్యపరంగా కూడా మంచిదే. ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.


ఎగ్ పొటాటో ఆమ్లెట్‌కు కావలసిన పదార్థాలు
బంగాళదుంప – ఒకటి
కోడిగుడ్డు – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
నూనె – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఒకటి
మిరియాల పొడి – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – చిటికెడు
కొత్తిమీర తరుగు – ఒక స్పూను

Also Read: ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే చేయాల్సినవి ఇవే !

ఎగ్ పొటాటో ఆమ్లెట్ రెసిపీ
1. బంగాళదుంప పైన చెక్కును తీసేసి చిన్నగా తరిగి నీటిలో ఉంచాలి.
2. ఒక పది నిమిషాల పాటు నీటిలో ఉంచాక చేత్తోనే బంగాళదుంప ముక్కలను పిండి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి.
5. ఆ తర్వాత పచ్చిమిర్చిని ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి వేయించాలి.
6. ఇవి మెత్తగా ఉడకడానికి ఒక పావుగంట సమయం పడుతుంది.
7. అవి మెత్తగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి.
8. ఇప్పుడు ఒక గిన్నెలో కోడి గుడ్డును పగల గట్టి వేయాలి.
9. అందులోనే ఉప్పు, పసుపు, మిరియాల పొడి, వేయించిన ఉల్లిపాయ బంగాళదుంపల మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి.
11. అందులోనే కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్లలాగా వేసుకోవాలి.12.  దీన్ని రెండు వైపులా కాల్చుకుని సర్వ్ చేయాలి.
13. అంతే టేస్టీ ఎగ్ పొటాటో ఆమ్లెట్ రెడీ అయినట్టే.
14. ఇది కాస్త మందంగా వస్తుంది. ఒక ఎగ్, ఒక బంగాళదుంప ఉన్న చాలు పిల్లలకు త్వరగా పొట్ట నిండేలా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది.


పెద్దవారికైతే రెండు గుడ్లు, ఒక బంగాళదుంపతో ఆమ్లెట్ ను వేసుకుంటే బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిపోతుంది. బంగాళదుంప మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక గుడ్డుకు ఒక మీడియం సైజు బంగాళదుంపని మాత్రమే వాడాలి. అదే రెండు గుడ్లతో ఆమ్లెట్ వేస్తే రెండు మీడియం సైజ్ బంగాళదుంపలను వాడవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×