Big Stories

Right Time to Eat: సమయానికి తినకపోతే ఎన్ని వ్యాధుల బారినపడతారో తెలుసా?

Right Time to Eat: బిజీబిజీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ రోజుల్లో చాలా మంది సమయానికి ఆహారం తీసుకోరు. ఉరుకులు పరుగులతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు అంటూ హడావిడిగా వెళుతుంటారు. ఈ తరుణంలో సరైన సమయానికి ఆహారం తీసుకోకుండా అనారోగ్యం బారిన పడుతుంటారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో శరీరంలోని శక్తి కోల్పోతారు.

- Advertisement -

ఇలా ప్రస్తుతం చాలా మంది ఇదే పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే తినడానికి సరైన సమయం కేటాయించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిజీబిజీ లైఫ్ లలో తినడానికి కూడా సమయానికి కేటాయించకపోతే త్వరగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. అయితే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

ప్రతీ రోజూ మూడు పూటలా తినే ఆహారాన్ని సమయానికి తీసుకోవాలట. అందులోను ఏ ఒక్కపూట కూడా ఆహారాన్ని తినకుండా ఉండకూడదట. ముఖ్యంగా ఉదయం తినే బ్రేక్‌ఫాస్ట్ సమయానికి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్ ను 7 గంటల నుంచి 8 గంటల మధ్యే తినేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల లోపే ఖాళీ కడుపుతో ఉండకుండా అల్పాహారం తీసుకోవాలట. ఇక మధ్యాహ్నం తీసుకునే భోజనాన్ని మధ్యాహ్నం 12.30 గంటల నుండి 2 గంటల మధ్యలోనే తినేయాలట.

Also Read: Health Tips: ఒంట్లో వేడితో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఎప్పుడైనా మధ్యాహ్న భోజనం సాయంత్రం 4 గంటల తర్వాత అసలు తినకూడదు. ఎందుకంటే సమయం దాటిని తర్వాత ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక రాత్రి తీసుకునే ఆహారాన్ని సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్యలోనే తినేయాలి. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు చెప్పిన సమయాల్లోనే ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News