చాలామందికి చెప్పులు లేకుండా ఉత్తకాళ్లతో నడిచే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా వాకింగ్ చేసేవారు ఇలా ఉత్తకాళ్లతో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని అంటారు. అది నిజమే, కానీ ఆధునిక కాలంలో కాలుష్యం పెరిగిపోయింది. దీనివల్ల చెప్పులు లేకుండా నడవడం వల్ల కొన్ని భయంకర రోగాల బారిన పడే అవకాశం ఉంది.
మహిళల్లో వచ్చే తీవ్రమైన వ్యాధి HPV. దీన్నే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అంటారు. ఇది ఒక లైంగికంగా సంక్రమించే వ్యాధి. లైంగిక సంపర్కం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్స్ సోకుతుంది. ఇది బ్యాక్టీరియాలు, వైరస్‌లు, శిలీంధ్రాలు లేదా పరాన్న జీవుల వల్ల కలుగుతాయి. ఒక వ్యక్తితో సన్నిహిత శారీరక సంబంధం వల్ల ఈ హెచ్ పి వి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. అయితే కేవలం లైంగిక సంబంధం వల్ల మాత్రమే కాదు, బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు వంటి వాటిచోట చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉందని తెలుస్తోంది.
HPV లో 100 రకాలకు పైగా వైరస్‌లు ఉన్నాయి. ఇవి మీ చేతులు, కాళ్లు ,ముఖంపై కూడా చేరుతాయి. పురీషనాళం, పాయువు, యోని, గర్భాశయం ఇలా ఎక్కడికైనా ఈ వైరస్ చేరి తీవ్రంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. HPV కేవలం లైంగిక కార్యకలాపం వల్ల మాత్రమే కాదు, చర్మం నుండి చర్మానికి సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. చెప్పుల్లేకుండా ఉత్త పాదాలతో నడిపించినప్పుడు పాదాలపై ఈ వైరస్ లు చేరి చిన్న మొటిమలకు కారణమవుతాయి. పాదాలు అడుగు భాగంలో కోతలు, పగుళ్లు వంటివి ఉంటే వాటి ద్వారా శరీరంలోకి చేరుతాయి. అలా చేరి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. జిమ్ లో చెప్పులు లేకుండా నడవడం వల్ల ఈ వైరస్ శరీరంలో చేరే అవకాశం చాలా ఎక్కువ.
పాదాలపై కూడా చిన్న చిన్న మొటిమల్లాగా వస్తూ ఉంటాయి. అవి ఈ వైరస్ వల్ల వచ్చి ఉండవచ్చు. ఆ మొటిమలను మీ చేతులతో తాకిన తర్వాత ఆ చేతులను పరిశుభ్రంగా శుభ్రపరుచుకోవాలి. లేకుంటే దాని ద్వారా నోరు, ముక్కులోంచి ఈ వైరస్ శరీరంలో చేరవచ్చు. మీ పాదాలను వీలైనంత వరకు పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. స్విమ్మింగ్ పూల్స్ వంటి ప్రాంతాల్లో చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాలపై వచ్చే మొటిమల్లాంటి వాటిని గోకడం వంటివి చేయకూడదు.
Also Read: మన శరీరంలో ఏ భాగానికి చలి ఎక్కువగా వేస్తుందో తెలుసా?
HPV వైరస్ మహిళల్లో ప్రమాదకరమైనది. ఇది గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతుంది. భారతదేశంలో జీవించే మహిళలకు వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా, గర్భాశయ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. మనదేశంలో 67 వేల మందికి పైగా మహిళలు కేవలం గర్భావయయ క్యాన్సర్ కారణంగానే మరణిస్తున్నారు. ఈ వైరస్ శరీరంలో చేరాక ఎలాంటి హాని కలిగించకుండా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఉండగలవు. ఆ తర్వాత ఒక్కొక్కసారి వాటంతట అవే పోతాయి. కానీ ఒక్కోసారి అవి క్యాన్సర్లుగా మారతాయి. హెచ్ పి వి వైరస్ లలో కూడా 100 రకాలు ఉండగా, అందులో ప్రమాదకరమైనవి 30 రకాలు ఉన్నాయి. ఇవే క్యాన్సర్లకు కారణం అవుతాయి.