EPAPER

Honey: తేనె తింటే మంచిదే, కానీ దానిలో ఈ పదార్థాలు కలుపుకొని తింటే మాత్రం ప్రమాదం

Honey: తేనె తింటే మంచిదే, కానీ దానిలో ఈ పదార్థాలు కలుపుకొని తింటే మాత్రం ప్రమాదం

Honey: తేనే సహజమైన తీపి పదార్థం. పువ్వులోని తేనె నుండి తేనెటీగలు దీన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆయుర్వేదంలో తేనెకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ ఒక స్పూను తేనె తాగిన వారు జలుబు, దగ్గు వంటి రోగాల బారిన తక్కువగా పడతారని చెబుతారు.


తేనెలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. అలాగే ఫినోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందుకే తేనెను తినమని ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.

తేనె తినడం మంచిదే కానీ కొన్ని రకాల ఆహారాలను అందులో కలుపుకొని తినకూడదు. మనకి ఆ విషయం తెలియక తేనెలో కలుపుకొని  కొన్ని రకాల ఆహారాలను తినేస్తున్నారు.


వేడి నీరు

వేడి నీటిలో తేనేలో కలుపుకొని తాగే వారి సంఖ్య ఎంతోమంది. నిజానికి వేడి నీటిలో తేనెను కలపకూడదు. గోరువెచ్చని నీటిలో మాత్రమే తేనెను కలుపుకోవాలి. వేడి నీటిలో తేనెను కలపడం వల్ల టాక్సిన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి.

దోసకాయ

దోసకాయతో చేసిన ఏ పదార్థం తిన్నా కూడా తేనెను వెంటనే తినకండి. కీరాదోసను తిన్న తర్వాత తేనె తింటే కొన్ని వ్యతిరేక ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే కీరాదోసకు శీతలీకరణ లక్షణాలు ఎక్కువ. తేనెకు మాత్రం వెచ్చగా ఉండే లక్షణం ఎక్కువ. ఈ రెండు కలిపి పొట్టలో అసమతుల్యతకు కారణం అవుతాయి.

Also Read: ఫ్లాక్ సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

నెయ్యి

నెయ్యితో చేసిన పదార్థాలు తిన్నాక తేనెను తినకండి. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి, తేనె వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. నెయ్యి శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటే తేనె వేడి చేస్తుంది. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్ మంచిది కాదు.

వేడి పాలు

వేడి పాలలో కూడా తేనె వేసుకుని తాగడం మానేయండి. అలా తాగితే అది విషపూరితమై అవకాశం ఉంది. పాలు, తేనే కలిసి పొట్టలో చేరి హానికరమైన సమ్మేళనాలను సృష్టిస్తాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి.

మాంసం చేపలు తిన్న తర్వాత కూడా తేనె తినడం నివారించండి. ఈ రెండింటి కలయిక శరీరంలో ప్రోటీన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది.

తేనెలో వెల్లుల్లిపాయలు ముంచుకుని తినడం కూడా మానేయండి. ఇలా తినడం వల్ల జీర్ణవ్యవస్థలో అసౌకర్యం కలుగుతుంది. వెల్లుల్లిలో బలమైన యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు ఉంటాయి. ఇవి తేనెతో కలిసినప్పుడు శరీరం వాటిని ప్రాసెస్ చేయలేదు

Related News

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×