BigTV English

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Murine Typhus Disease: కేరళ ప్రభుత్వాన్ని మరో అరుదైన వ్యాధి కలవర పెడుతోంది. ఆ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన మురిన్ టైఫస్ అనే వ్యాధిని వైద్యులు గుర్తించారు. 75 ఏండ్ల వ్యక్తి అరుదైన బ్యాక్టీరియల్ వ్యాధికి గురై హాస్పిట్లలో చేరాడు. వెంటనే అల్టర్ అయిన అధికారులు అతడికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతడితో పాటు అతడి వెంట ఉన్నవారికి సైతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసలు ఇంతకీ మురిన్ టైఫస్ అంటే ఏంటి? ఈ వ్యాధి సోకితే కలిగే లక్షణాలు ఏంటి? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


రికెట్సియా టైఫితో మురిన్ టైఫస్ వ్యాప్తి

కేరళకు చెందిన 75 ఏండ్ల వ్యక్తి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. రీసెంట్ గా ఆయన ఫారిన్ టూర్ కు వెళ్లారు. వియత్నాం, కాంబోడియాలో తిరిగి వచ్చారు. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట లాంటి సమస్యలతో దవాఖానాలో చేరాడు. అతడికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అతడి లివర్ తో పాటు కిడ్నీల్లో సమస్యలున్నట్లు గుర్తించారు. చివరకు అతడికి మురిన్ టైఫస్ సోకినట్లు గుర్తించారు. మురిన్ టైఫస్ అనేది ఫ్లీ బర్న్ బాక్టీరియా అయిన రికెట్సియా టైఫి కారణంగా సోకుంతుంది. ఈ వ్యాధి సోకిన దోమ మనుషులను కరిచినప్పుడు వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ఒక్కసారి దోమ శరీరంలోకి వెళ్తే జీవితాంతం దాని బాడీలో ఉండిపోతుంది. ఎలుకలు, ముంగిసల ద్వారా కూడా ఈ వ్యాధి సోకుతుంది. పెంపుడు జంతువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.


మురిన్ టైఫస్ లక్షణాలు

మురిన్ టైఫస్ అనేది మనిషి శరీరంలోకి ప్రవేశించిన 7 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, చర్మం మీద దద్దుర్లు వస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే, నెలల పాటు అలాగే ఉంటుంది. ఒక్కోసారి మనిషి మరణానికి కారణం అవుతుంది.

మురిన్ టైఫస్‌ చికిత్స

మురిన్ టైఫస్ కు ప్రస్తుతం ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. ఎలాంటి టీకా అందుబాటులో లేదు. ఈ వ్యాధి చికిత్స కోసం డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్ ను ఉపయోగిస్తున్నారు.  వీలైనంత త్వరగా వ్యాధిని నయం చేయకపోతే పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది.

మురిన్ టైఫస్‌ నివారణ

ఇంట్లో దోమలు, ఈగలు పెరగకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువులకు సైతం దోమలు, ఈగలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్స్ ను శుభ్రంగా ఉంచుకోవాలి. రెండు రోజులకు ఓసారి స్నానం చేయించాలి. తప్పని సరిగా టీకాలు వేయించాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈగలు, దోమలు రాకుండా చూసుకోవాలి.

Read Also: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×