BigTV English

Heart Attack : జిమ్ చేసేప్పుడు ఆ లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు..!

Heart Attack  : జిమ్ చేసేప్పుడు ఆ లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు..!

exercise


Heart Problems with Workouts : ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ ఇదే వ్యాయామం కొంత మందికి గుండె పోటుకు కారణం అవుతుంది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కొందరు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఇలా జరగడం వెనుక అతిగా వ్యాయామం చేయడమే అంటున్నారు వైద్య నిపుణులు. మన శక్తకి మించి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుండెలోని విద్యుత్ కేంద్రం కొన్నిసార్లు అస్తవ్యస్తం అయ్యే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అతి వ్యాయామం చేయడం వల్ల గుండెకు ఎటువంటి ముప్పు ఉందో తెలుసుకుందాం.

వ్యాయామ సమయంలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదాలు ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి. అయితే ఇలాంటి ప్రమాదాలు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపడతాయి. వాటిని గుర్తించి వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాలి అంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు.


Read More : అనంత్ అంబానీ మళ్లీ అంత బరువు ఎలా పెరిగారు..?

వ్యాయామం చేసేప్పుడు అలసట, ఛాతీలో అసౌకర్యం, వ్యాయామం చేసే సమయంలో విపరీతమైన చెమట వంటి లక్షణాలు గుండె సమస్యలకు సాధారణ లక్షణాలు. వీటిని అస్సలు విస్మరించకూడదు. గుండె సమస్యలకు దారితీసే మరిన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఛాతీ నొప్పి

ఎక్సర్సైజ్ చేసేప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం కలగడం అనేది హార్ట్ఎటాక్ ప్రధాన లక్షణం. కొందరు ఛాతీ నొప్పి వస్తుంటే వ్యాయామం వల్ల కలిగిందేమో అనుకుంటారు. మీకు కలుగుతున్న నొప్పి ఇంతక ముందెప్పుడు లేనివిధంగా ఉంటే వెంటనే అప్రమత్తమవ్వాలి. గుండె నొప్పి ఎడమ చేతికి వ్యాపిస్తుంది. చెమట ఎక్కువగా పడుతుంది. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. మధుమేహమున్నవారికి అయితే ఈ లక్షణాలు కనిపించవు. వారి సైలంట్ హార్ట్ ఎటాక్ అవుతుంది.

ఊపిరి ఆడకపోవడం

వ్యాయామం చేస్తున్నప్పుడు ఛాతీలో అసౌకర్యంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగితే వెంటనే ఎక్సర్సైజ్ కచ్చితంగా ఆపాలి. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణాలలో ఒకటి. ఈ లక్షణం ఛాతీ నొప్పితో వస్తుంది. కొన్నిసార్లు నొప్పి లేకుండా కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది.

కళ్లు తిరగడం

జిమ్ చేసే సమయంలో అలసిపోవడం అనేది సాధారణం. కానీ.. ఎక్కువగా అలసిపోతున్న భావన మీలో ఉంటే.. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఈ జిమ్​ ఫీల్డ్​కి కొత్త అయితే.. మీకున్న లక్షణాలను వెంటనే ట్రైనర్​ దృష్టికి తీసుకువెళ్లాలి. ఎందుకంటే ఇది గుండెపోటు హెచ్చరికలు ఇస్తుంది. కాబట్టి వెంటనే వ్యాయామం ఆపేయండి.

గుండెలయలో మార్పులు

కొంత మందికి వంశపారంపర్యంగా గుండె సంబంధిత సమస్యలుంటాయి. కానీ ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. అలాంటి వారు తీవ్రంగా శ్రమించినప్పుడు అడ్రినలిన్ హార్మోన్ విడుదలై విద్యుత్ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది. ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండె లయ దెబ్బతింటుంది. అప్పుడు గుండె బాగా నెమ్మదిగా, వేగంగా లేదా పూర్తిగా ఆగిపోవచ్చు.

వ్యాయామం చేస్తున్నప్పుడు హృదయ స్పందనలో మార్పులు గమనిస్తే కాస్త జాగ్రత్తగా ఉండండి. గుండెచప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న అది గుండె సంబంధిత సమస్య కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.

Read More : మీ మూడ్ అస్సలు బాగోలేదా.. ఇలా సెట్ చేయండి!

గుండె పోటు రావడానికి అప్పటి శారీరక స్థితి, ఆరోగ్యం, ఇతరత్రా కారణాలుగా చెప్పవచ్చు. ముందు రోజు తీసుకున్న మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల వల్ల శరీరం వ్యాయామానికి సహకరించకపోవచ్చు. వీటిని పట్టించుకోకుండా ఎప్పటి లాగానే విపరీతంగా ఎక్సర్​సైజ్ చేసినప్పుడు గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె పోటు వచ్చిందని, ఎక్కడో, ఎవరికో ఏదో అయిందని భయపడటం సరికాదు. రోజూ ఎంతో మంది సురక్షితంగా వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. అయితే వ్యాయామం ప్రారంభించే ముందు ఒకసారి ఈసీజీ, టుడీ ఎకో, ట్రెడ్ మిల్ వంటి పరీక్షలు చేసుకోవడం మంచిది.

Disclaimer : ఈ కథనాన్ని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా అందిస్తున్నాం.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×