DK Shiva Kumar on Rameshwaram Cafe Blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడు, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)లో ఉపయోగించిన పదార్థాల ద్వారా 2022లో మంగుళూరు, శివమొగ్గలో జరిగిన పేలుళ్లకు పోలికలు ఉన్నాయని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం తెలిపారు.
‘మంగుళూరు ఘటనకు, ఈ ఘటనకు లింక్ ఉంది. ఇదీ మన పోలీసు అధికారులు చెబుతున్న మాట. లోపల ఉన్న పదార్థం కూడా అలాంటిదే. టైమర్, అందులి వాడిన పదార్ధాలు వంటి వాటికి లింక్ ఉంది. మంగుళూరు, శివమొగ్గ పోలీసులు ఇక్కడ విచారణ చేపట్టారు. ఇది స్థానిక పదార్థాలతో కూడిన తక్కువ తీవ్రత కలిగిన పేలుడు” అని బెంగళూరు ఇన్‌ఛార్జి మంత్రి శివకుమార్ అన్నారు.
రామేశ్వరం కేఫ్‌లోని ఐఈడీలో ఉపయోగించిన పేలుడు వ్యవస్థ, టైమర్, టైమర్ బ్యాటరీలు మంగళూరు పేలుళ్లకు ఉపయోగించిన వాటితో సమానంగా ఉన్నాయని పోలీసులు శుక్రవారం తెలిపారు.
Read More: అది బాంబు దాడే.. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడుపై కర్ణాటక సీఎం..
వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించడంతో కనీసం తొమ్మిది మంది గాయపడ్డారు. పేలుడు పరికరాన్ని ఒక ‘కస్టమర్’ బ్యాగ్‌లో తెచ్చి, ఆహారం తిని వెళ్లిపోయాడు.
పేలుడు తర్వాత, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం మంగుళూరు, బెంగళూరులో IED పేలుళ్లకు ఉపయోగించిన కంటైనర్లలో తేడాలను ఎత్తి చూపారు. మంగుళూరులో ప్రెషర్ కుక్కర్ అని, ఇప్పుడు టిఫిన్ బాక్స్ రకం బాక్స్ అని మైసూరులో చెప్పారు.
అనుమానితుడు రాకపోకల దృశ్యాలు పోలీసుల వద్ద ఉన్నాయని డిప్యూటీ సీఎం శివకుమార్ శనివారం తెలిపారు.
“ఏడు నుంచి ఎనిమిది బృందాలు సాధ్యమైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి. బెంగళూరు అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయి. అనుమానితుడు బస్సు ఎక్కుతున్న, దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఘటన తర్వాత అతను తిరిగి వెళ్లిన దృశ్యాలు ఉన్నాయి. విచారణ పెద్ద ఎత్తున జరుగుతోంది’ అని శివకుమార్ తెలిపారు.
బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మంగుళూరు, శివమొగ్గ పేలుళ్లు జరిగాయని గుర్తు చేస్తూ ఈ పరిస్థితిని రాజకీయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని శివకుమార్ తెలిపారు.
“పార్లమెంటులో ఒక సంఘటన జరిగింది. ఈ విషయాలను రాజకీయం చేసి అందరినీ నిందించలేం. అనుమానితుడు సామాన్యుడిలా చిన్న బ్యాగ్‌తో కేఫ్‌లోకి వెళ్లాడు’ అని శివకుమార్ స్పష్టం చేశారు.
‘బీజేపీని రాజకీయాలు చేయనివ్వండి. వారు సానుకూలంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటే అది స్వాగతించదగిన విషయం.. అలా కాకుండా రాజకీయాలు చేయాలనుకుంటే చేయనివ్వండి. సమస్యను అన్ని కోణాల్లో దర్యాప్తుచేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాం. బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది” అని శివకుమార్ ఆరోపించారు.