BigTV English

Makeup Tips: పండగలు, ఫంక్షన్ల సమయంలో ఇలా చేస్తే ..నేచురల్‌గానే మెరిసిపోతారు తెలుసా ?

Makeup Tips: పండగలు, ఫంక్షన్ల సమయంలో ఇలా చేస్తే ..నేచురల్‌గానే మెరిసిపోతారు తెలుసా ?

Makeup Tips: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటే మాత్రం మేకప్‌పై కాస్త శ్రద్ద చూపించాల్సిందే. ముఖ్యంగా ఇందుకోసం మీ చర్మాన్ని తేమగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. అందుకు తగిన చిట్కాలు తప్పకుండా పాటించాలి. అప్పుడు మాత్రమే మీరు అందరిలో ప్రత్యేకంగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది.


గ్లోయింగ్ స్కిన్ కోసం తరుచుగా నీరు త్రాగుతూ ఉండండి. ఇదే కాకుండా తాజా పండ్ల రసం, కొబ్బరి నీరు, నిమ్మరసం, సూప్‌ లను మీ ఆహారంలో చేర్చుకోండి. తగినంత నిద్రపోండి. దీంతో డార్క్ సర్కిల్స్ సమస్య రాకుండా ఉంటుంది.

స్కిన్ కేర్:


1. క్లెన్సింగ్-టోనింగ్: చర్మం యొక్క టోనింగ్-క్లెన్సింగ్-మాయిశ్చరైజింగ్ విషయంలో జాగ్రత్త వహించండి. టోనింగ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో చర్మం మృదువుగా, హైడ్రేటెడ్‌గా కనిపిస్తుంది. చర్మం యొక్క pH బ్యాలెన్స్ కూడా చేయబడుతుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు CTM రొటీన్‌ను అనుసరించడం మర్చిపోవద్దు. CTM అంటే స్కిన్ శుభ్రపరచడం, టోనింగ్, మాయిశ్చరైజింగ్ .

2. మేనిక్యూర్-పెడిక్యూర్: మీ ముఖ సౌందర్యంతో పాటు, మీ చేతులు, పాదాలపై కూడా శ్రద్ధ వహించండి. పండుగ సీజన్‌లో పెడిక్యూర్ చేయించుకోండి. కొన్ని కారణాల వల్ల మీరు పార్లర్‌కు వెళ్లలేకపోతే, ఇంట్లో నిమ్మరసం, చక్కెర కలిపి ఈ మిశ్రమాన్ని చేతులు, కాళ్ళకు మసాజ్ చేయండి. దీంతో మీ చర్మం మెరిసిపోతుంది.

3. అలసట ఉండదు:పండగలు, ఫంక్షన్ల సమయంలో కాళ్ళలో అలసట మొదలవుతుంది. అటువంటి పరిస్థితిలో మీ పాదాల ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.నిద్రపోయే ముందు మీ పాదాలకు మసాజ్ చేయండి. ఇదే కాకుండా, అరకప్పు బేకింగ్ సోడా, కొద్దిగా రాక్ సాల్ట్, ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్, కొన్ని చుక్కల లావెండర్ నూనెను అర టబ్ గోరువెచ్చని నీటిలో వేసి అందులో మీ పాదాలను ఉంచండి. కొంత సమయం తర్వాత కాటన్ క్లాత్ లేదా మెత్తని టవల్ తో పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇది మీ కాళ్ళ నుండి అలసటను తొలగిస్తుంది. అంతే కాకుండా కాళ్లు మృదువుగా మారుతాయి.

4. మేకప్ స్టెప్స్ :
పండుగ సీజన్‌లో ఏదైనా పార్టీకి, పెళ్లికి లేదా పూజ పండుగకు వెళుతున్నట్లయితే, అప్పుడు వాటర్ ప్రూఫ్ మేకప్ మాత్రమే చేసుకోండి. ఇది కాకుండా, అందమైన మేకప్ లుక్ పొందడానికి కొన్ని ఇతర చిట్కాలను పాటించడం మర్చిపోవద్దు.

ముందుగా ముఖం, మెడపై ఫౌండేషన్ అప్లై చేసి తడి స్పాంజి, వేళ్ల సహాయంతో బాగా బ్లెండ్ చేయాలి.మీ స్కిన్ టోన్ ప్రకారం ఫౌండేషన్ అప్లై చేయండి. కావాలంటే గోల్డ్ ఫౌండేషన్ కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది. దాని పైన బ్లషర్‌ను తేలికగా రుద్దండి.

బ్లషర్ ,లిప్‌స్టిక్ షేడ్‌ లను కూడా జాగ్రత్తగా ఎంచుకోండి. ఆరెంజ్ కలర్ లిప్‌స్టిక్‌ను అప్లై చేసినట్లయితే, అదే రంగు బ్లషర్‌ని ఉపయోగించకండి.బ్లష్‌ను సెటక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫెయిర్ స్కిన్ కోసం పింక్ , రెడ్ బ్లషర్ ఉపయోగించండి. మీ చర్మం మరీ తెలుపు రంగులో ఉంటే, ఆరెంజ్ బ్లషర్‌ని ఉపయోగించండి . ఇలాంటి స్కిన్ పై పింక్ , సిల్వర్ కలర్స్ బాగా కనిపిస్తాయి. చర్మం డస్కీగా ఉంటే ముదురు ఎరుపు, సిల్వర్ బ్లష్ బాగుంటుంది.

Related News

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×