Makhana Health Benefits: మఖానాను తామర గింజలు అని కూడా పిలుస్తారు. ఇవి అత్యంత రుచికరంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలోని పుష్కలంగా పోషకాలు కూడా ఉంటాయి. మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫైబర్, ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయి. వీటిని తరుచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంతో పాటు మధుమేహ సంబంధిత వ్యాధులు ఉన్న వారు వీటిని తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
మఖానా తినడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వీటిని చాలా పచ్చిగా కూడా తినవచ్చు. లేదా కాల్చి కూడా తినవచ్చు. లేదా కూరల్లో కూడా చేర్చుకోవచ్చు. మరి మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించిన పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మఖానా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
బరువు తగ్గడం:
మఖానాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు . ఫలితంగా తక్కువగా తింటాము. దీని వల్ల బరువు తగ్గడానికి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి.
గుండె ఆరోగ్యం:
మఖానాలో మెగ్నీషియం ఉంటుంది. ఇందులోని పొటాషియం కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం హృదయ స్పందన రేటును అదుపులో ఉంచడంలో దోహదం చేస్తుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు మఖానా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
మధుమేహం :
మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది మధుమేహం ఉన్న వారికి మంచి పోషకాహారం. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మఖానా సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు:
మఖానాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్ శరీరంలోని కొన్ని రకాల కణాలు దెబ్బతీస్తాయి. మఖానా తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. మఖానా తరుచుగా తినడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
మఖానా ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు మఖానా తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: ఈ ఆహారాలు ఆరోగ్యకరమైనవే, కానీ కిడ్నీలో రాళ్లకు కారణమవుతాయి
ఎముకలను బలపరుస్తుంది:
మఖానా కాల్షియం యొక్క మూలం. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి అవసరం. మఖానా కాల్షియం బోలు ఎముకల వ్యాధిని కూడా నిరోధించడంలో సహాయపడుతుంది. ఎముకలు బలంగా ఉండటానికి చిన్న పిల్లలకు మఖానాను ఎక్కువగా తినిపించడం మంచిది.
ఒత్తిడిని తగ్గిస్తుంది:
మఖానా మెగ్నీషియం యొక్క మూలం. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం కండరాలను సడలించడానికి , నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది.