Indian Railways: రైల్వే ప్రయాణంలో కోరుకున్న టికెట్ కన్ఫార్మ్ కావాలని చాలా మంది భావిస్తారు. కొన్నిసార్లు అనుకున్న బెర్తులు దొరుకుతాయి. మరికొన్నిసార్లు అనుకున్న సీట్లు దొరకవు. ముఖ్యంగా లోయర్ బెర్త్ ల కోసం చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ, అంత ఈజీగా లభించవు. కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఎందుకు లోయర్ బెర్త్ అంత ఈజీగా దొరకదు?
సాధారణంగా రైల్లో బెర్తుల కేటాయింపు అనేది ఓ పద్దతి ప్రకారం జరుగుతుంది. రైలు ప్రయాణ వేగాన్ని బట్టి రిజర్వేషన్ టికెట్లను కేటాయిస్తారు. అదే సమయంలో ముందుగా టికెట్లను బుక్ చేసుకున్న వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా రైలులో S1 నుంచి S10 వరకు స్లీపర్ క్లాసు బోగీలు ఉంటే, వాటిలో ఒక్కో కోచ్ లో 72 సీట్లు ఉంటాయి. తొలుత టికెట్ బుక్ చేసుకునే వారికి మధ్య బోగీల్లో అంటే S5 లేదంటే S6లో టికెట్ కేటాయిస్తారట. వాటిలోనూ 30 నుంచి 40 నంబరు సీట్లను కేటాయిస్తారు. అందులోనూ ఫస్ట్ బుక్ చేసుకున్న వారికి లోయర్ బెర్త్ రిజర్వ్ చేస్తారు. రైల్లో గ్రావిటీ సెంటర్లు సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు, అప్పర్ బెర్త్ ల కంటే ముందుగా లోయర్ బెర్త్ లను కేటాయిస్తారు. ఇదే పద్దతి ప్రకారం ఫస్ట్ మధ్యలో ఉండే బోగీలలోని మధ్య సీట్లు, నెమ్మదిగా చివరి సీట్లు కేటాయిస్తారు. మొదట లోయర్ బెర్త్, ఆ తర్వాత అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్ కేటాయిస్తారు. ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో S4, S7 సహా ఇతర బోగీలలోనూ ఇలాగే బెర్తులను కన్ఫార్మ్ చేస్తారు.
అన్ని కోచ్ లలో బరువు సమానంగా ఉండేలా…
రైళ్లలో బెర్తుల కేటాయింపు అనేది అన్ని బోగీలలో బరువు సమానంగా ఉండేలా జరుగుతుంది. అందుకే, ప్రయాణానికి ముందు టికెట్ కోసం ప్రయత్నించినప్పుడు, అప్పర్ బెర్తులు అందులోనూ 1 నుంచి 6, 66 నుంచి 72 నెంబర్ సీట్లు లభిస్తాయి. అయితే, వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా ఎవరైనా తమ సీటు క్యాన్సిల్ చేసుకుంటే ఇతర బెర్తులు కూడా లభించే అవకాశం ఉంటుంది. IRCTC ఇష్టారాజ్యంగా కాకుండా, ఓ పద్దతి ప్రకారం బెర్తులను కేటాయిస్తుంది. లేదంటే, ప్రయాణ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎక్కువ వేగంగా ప్రయాణించే సమయంలో మలుపులు తిరిగితే బరువు సమానంగా లేక పట్టాలు తప్పే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే, చాలా ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకుంటే తప్ప, లోయర్ బెర్త్ లు లభించవంటున్నారు రైల్వే నిపుణులు.
Read Also: భారతీయ రైల్వేలో అన్ని క్లాస్ లు ఉంటాయా? ఒక్కో క్లాస్ టికెట్ రేటు ఎంత ఉంటుందో తెలుసా?
రైల్వే టికెట్ల కేటాయింపు అనేది అన్ని క్లాస్ లలో ఓ పద్దతి ప్రకారం కొనసాగుతుందంటుందున్నారు రైల్వే అధికారులు. నచ్చినట్లుగా కేటాయించే అవకాశం లేదంటున్నారు. ఆయా రైళ్ల బోగీల సంఖ్య, అవి ప్రయాణించే వేగం ఆధారంగా బెర్తుల ఖరారు ఉంటుంది అంటున్నారు.
Read Also: కిలో మీటర్ రైల్వే లైన్ నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!