Natural Face Packs: చలికాలంలో స్కిన్ పొడిబారుతుంది. అంతే కాకుండా ముఖంలో మెరుపు కూడా తగ్గుతుంది. ఈ సీజన్ లో ముఖం నిర్జీవంగా మారడమే కాకుండా పొడిగా తయారవుతుంది. అందుకే చలికాలంలో ప్రత్యేకమైన స్కిన్ కేర్ చాలా ముఖ్యం.
మీ ముఖాన్ని మృదువుగా, కాంతివంతగా మార్చడానికి హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది . వీటిలో రసాయన పదార్థాలు వాడకుండా తయారు చేయడం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి. అంతే కాకుండా వీటిని తరుచుగా వాడటం వల్ల మీ ముఖం అందంగా మెరిసిపోతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలో 2 చెంచాల తేనె, ఒక చెంచా అలోవెరా జెల్, ఒక చెంచా గ్లిజరిన్, ఒక చెంచా బియ్యప్పిండి , 3 చెంచాల రోజ్ వాటర్ తీసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత బాగా కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మృతకణాలను తొలగించి మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఇది వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కాఫీతో తయారు చేసిన ఫేస్ ప్యాక్:
మృత చర్మ కణాలను తొలగించేందుకు కాఫీ పౌడర్ తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉత్తమ పరిష్కారం. ఇందుకోసం ఒక గిన్నెలో కాఫీ పొడి, అలోవెరా జెల్, పసుపు, పంచదార పొడిని తీసుకోవాలి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఈ ప్యాక్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి వాష్ చేయండి.
శనగపిండి ఫేస్ ప్యాక్:
చలికాలంలో మెరిసే చర్మం కోసం, శనగపిండి ఫేస్ ప్యాక్ అప్లై చేయండి. ఇందుకోసం ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండి, 1 చెంచా పాలు, పసుపు, పాలు కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీని తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి.
పెరుగు , పసుపు ఫేస్ మాస్క్:
పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.
2 టీస్పూన్ల పెరుగులో 1/4 టీస్పూన్ పసుపు వేసి పేస్టులా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఓట్స్ , హనీ ఫేస్ మాస్క్:
ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది.
2 చెంచాల ఓట్స్‌ను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
అలోవెరా, శాండల్‌వుడ్ ఫేస్ మాస్క్:
అలోవెరా చర్మాన్ని మృదువుగా , తేమగా ఉంచుతుంది. చందనం చర్మాన్ని టోన్ చేస్తుంది.
2 టీస్పూన్ల అలోవెరా జెల్‌లో 1 టీస్పూన్ గంధపు పొడిని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Also Read: ముఖంపై కొవ్వును తగ్గించే.. బెస్ట్ చిట్కాలు
అరటిపండు , తేనె ఫేస్ మాస్క్:
అరటిపండు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది.
సగం పండిన అరటిపండును మెత్తగా చేయాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
శనగపిండి,పెరుగు ఫేస్ మాస్క్:
శనగపిండి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పెరుగు చర్మాన్ని తేమ చేస్తుంది.
2 టీస్పూన్ల శనగపిండిని 2 టీస్పూన్ల పెరుగుతో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖం మీద 15-20 నిమిషాలు అప్లై చేసి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ మాస్క్‌లను వారానికి 2-3 సార్లు అప్లై చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.