BigTV English
Advertisement

Indian Railway Rules: రైల్వే కౌంటర్ లో తీసుకున్న టికెట్ ను ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేసుకోవచ్చా? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

Indian Railway Rules: రైల్వే కౌంటర్ లో తీసుకున్న టికెట్ ను ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేసుకోవచ్చా? రైల్వే రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

Railway Ticket Cancellation Rules: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులు ఈజీగా, ఆహ్లాదకరంగా జర్నీ చేసేలా  ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నది. సులభంగా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు అనివార్య కారణాలతో టికెట్లు క్యాన్సిల్ చేసేకునే వెసులుబాటు కల్పిస్తున్నది. రైల్వే ప్రయాణీకుల సౌకర్యం కోసం రిజర్వేషన్ టికెట్ బుకింగ్ విషయంలో కీలక మార్పులు చేసింది. టికెట్ క్యాన్సిలేషన్ ప్రక్రియను మరింత ఈజీ చేసింది. ప్రస్తుతం చాలా మంది ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు ఆన్ లైన్ లోనే క్యాన్సిలేషన్ చేస్తున్నారు.


కౌంటర్ టికెట్ ను ఆన్ లైన్ లో క్యాన్సిల్ చెయ్యొచ్చా?

ఇప్పటికీ కొంత మంది రైల్వే కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. గతంలో రైల్వే కౌంటర్లలో రిజర్వేషన్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాలంటే తప్పకుండా మళ్లీ రైల్వే స్టేషన్ కు వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రైల్వేశాఖ ప్రయాణీకులకు కాస్త వెసులుబాటు కల్పిస్తున్నది. ఇకపై రైల్వే కౌంటర్లలో రిజర్వ్ చేసుకున్న టికెట్ ను కూడా ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నది.


కౌంటర్ టికెట్ ఆన్‌లైన్ లో ఎలా క్యాన్సిల్ చేయాలంటే?

⦿ ముందుగా ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

⦿ ఇందులో మీకు టికెట్ క్యాన్సిల్ ఆప్షన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

⦿ క్యాన్సిల్ కౌంటర్ టికెట్ ఆప్షన్ ఉంటుంది.

⦿ సెక్యూరిటీ క్యాప్చా , PNR నెంబర్, రైలు నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ వివరాలు మీ కౌంటర్ టికెట్‌ మీద ఉంటాయి.

⦿ ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ వచ్చే ఓటీపీతో కన్ఫార్ట్ చేసుకోవాలి.

⦿ మీరు కౌంటర్ టికెట్ తీసుకున్నప్పుడు ఫామ్‌ లో ఏ నెంబర్ ఇస్తారో అదే నెంబర్‌ కు ఓటీపీ వస్తుంది.

⦿ ఆ తర్వాత స్క్రీన్‌ మీద కనిపించే బాక్స్ లో ప్రయాణీకుడి వివరాలను నిర్థారించుకోవాలి.

⦿ చివరిగా సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కౌంటర్ టికెట్ క్యాన్సిల్ అవుతుంది.

Read Also: కిలో మీటర్ రైల్వే లైన్ నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

రీఫండ్ ఎలా పొందాలంటే?

కౌంటర్ టికెట్ ఆన్ లైన్ లో క్యాన్సిల్ చేసినప్పటికీ రీఫండ్ కోసం సమీపంలోని రైల్వే స్టేషన్ కు తప్పకుండా వెళ్లాలి. మీరు క్యాన్సిల్ చేసిన టికెట్‌ ను కౌంటర్ లో అందిస్తే మీకు రావాల్సిన రీఫండ్ ను ఇస్తారు. అయితే, రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే కౌంటర్ టికెట్ సబ్ మిట్ చేయాసి ఉంటుంది. ఒకవేళ RAC లేదంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే రైలు షెడ్యూల్ టైమ్ కు అరగంట ముందుకు వరకు ఇచ్చినా సరిపోతుంది. తాజాగా తీసుకొచ్చిన ఈ విధానాన్ని అవసరం అయిన వాళ్లు వినియోగించుకోవాలని రైల్వేశాఖ అధికారులు సూచించారు.

Read Also: భారతీయ రైల్వేలో అన్ని క్లాస్ లు ఉంటాయా? ఒక్కో క్లాస్ టికెట్ రేటు ఎంత ఉంటుందో తెలుసా?

Read Also: పట్టాల మీద సెల్ఫీ దిగితే, జైల్లో చిప్పకూడు తినాల్సిందే.. ఇండియన్ రైల్వే సీరియస్ వార్నింగ్!

Related News

Mumbai Train: మరో రైలు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

IRCTC – New Year 2026: IRCTC క్రేజీ న్యూ ఇయర్ టూర్ ప్యాకేజీ, ఏకంగా 6 రోజులు ఫారిన్ ట్రిప్!

IRCTC TN Temples Tour: హైదరాబాదు నుండి తమిళనాడు ఆలయాల యాత్ర.. 7 రోజుల ఆధ్యాత్మిక పర్యటన వివరాలు

Train Food: రైలులో వెజ్ బిర్యానీ కొన్న ప్రయాణికుడు.. రూ.25 వేలు చెల్లించిన రైల్వే, ఎందుకంటే?

Lower Currency Countries: ఈ దేశాల్లో మన రుపాయికి విలువ చాలా ఎక్కువ, వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి!

Monorail Derails: ముంబైలో పట్టాలు తప్పిన మోనో రైలు.. మరి ప్రయాణికులు?

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

US Shutdown 2025: అమెరికాలో క‌ల‌క‌లం..నిలిచిపోయిన‌ విమాన సేవలు, ప్ర‌యాణికుల‌కు క‌ష్టాలు !

Big Stories

×