BigTV English

Home Remedies For Dandruff : డాండ్రఫ్ తో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలు మీ కోసమే..

Home Remedies For Dandruff : డాండ్రఫ్ తో బాధపడుతున్నారా?.. ఈ చిట్కాలు మీ కోసమే..

Home Remedies For Dandruff | మీరెప్పుడైనా అందంగా తయారై ఎక్కడైనా పార్టీలకు వెళ్లే సమయంలో లేదా ఇంటర్‌వ్యూకు వెళ్లే సమయంలో తలలో దురద వస్తే ఏం చేస్తారు. చేత్తో తలలో దురద ఉన్న చోట గోకుతారు. ఇలా అందరూ చూస్తుండగా చేయాల్సివస్తే.. అందరి ముందు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఒకవేళ ఏదైనా డార్క్ కలర్ డ్రెస్సు వేసుకొని ఉన్నసమయంలో దురద ఉన్న చోట నుంచి మీ డ్రెస్సుపై తలలో నుంచి డాండ్రఫ్ రాలుతోందనుకోండి. ఎలా అనిపిస్తుంది?.. అందరూ మీ నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.


ప్రపంచంలో సగం యువ జనాభా పురుషులైనా.. స్త్రీలైనా.. డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్నారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే డాండ్రఫ్ ఒక ఆరోగ్య సమస్య. ఇది మలస్సేజియా అని ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ మన తలలోని చర్మం నుంచి వెలువడే సెబమ్‌ని (నూనె లాంటి పదార్థం) , తలలో ఇతర స్కిన్ డెడ్ సెల్స్ ని ఆహారంగా తీసుకుంటుంది. ఈ మలేస్సేజియా ఫంగస్ సెబమ్, చర్మ డెడ్స్ సెల్స్ తినేశాక తలలోనే ఒక రకమైన ఫ్యాటీ యాసిడ్స్ విడుదల చేస్తుంది. ఆ ఫ్యాటీ యాసిడ్స్ తలలోని చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా తలలో చర్మం పొడిబారిపోవడం, దురద రావడం జరుగుతుంది. ఆ తరువాత తలలో చర్మం డెడ్ సెల్స్ చిన్న చిన్న ఫ్లేక్స్ రూపంలో రాలుతూ ఉంటుంది.

అయితే ఈ సమస్యకు ఇంట్లోనే చిట్కాలతో పరిష్కరించవచ్చు.


1. తలకు ఎక్కువ సేపు నూనె పెట్టకూడదు: చర్మ వైద్యుల ప్రకారం.. తలకు నూనె పెట్టడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుందనేది ఒక అపోహ. డెర్మటాలజిస్ట్ (చర్మవ్యాధి నిపుణులు) డాక్టర్ దీపాలి భరద్వాజ్ ప్రకారం.. జుట్టుకు నూనె రాయడం మంచిదే. కానీ డాండ్రఫ్ ఉన్న తలభాగం అలా నూనె పట్టిస్తే ఆ ప్రాంతంలో మరింత దురద పెరుగుతుంది. ఈ కారణంగా మలస్సేజియా ఫంగస్ ఇంకా వ్యాపిస్తుంది. అందుకే తలకు నూనె పట్టించిన కాసేపు తరువాత తలస్నానం చేసేయాలి. ఎక్కువ రోజులు నూనె పట్టించ ఉంచకూడదు.

2. వినేగార్ : చర్మం పొడిబారినప్పుడు, దురద కలిగే భాగంలో డాండ్రఫ్ కు కారణమయ్యే ఫంగస్, బ్యాక్టిరియాను అంతమొందించాలంటే ఇంట్లోనే లభించే వినేగార్ ఔషధంగా పనిచేస్తుంది. చిన్న గ్లాసులో సగ భాగం నీరు, సభ భాగం వినేగార్ కలిపి ఆ తరువాత దాంతో తలకు అరగంట సేపు పట్టించి ఆ తరువాత స్నానం లేదా తలను వాష్ చేసుకోవాలి. వినేగార్ లోని అసిడిక్ కంటెంగ్ డాండ్రఫ్ ఫ్లేక్స్ ని అరికడుతుంది.

3. బేకింగ్ సోడా: డాండ్రఫ్ వల్ల తలలోని చర్మంలో డెడ్ సెల్స్ ఏర్పడతాయి. బేకింగ్ సోడా ఆ చర్మంపై ఒక స్క్రబ్ లాగా పని చేస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి ఇర్రిటేషన్ లేకుండా డెడ్ సెల్స్ తొలగిస్తుంది. ఎక్స్‌ఫోలియేషన్ వల్ల మళ్లీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. బేకింగ్ సోడా లోని యాంటీ ఫంగల్, ఎక్స్‌ఫోలియేషన్ గుణాలు.. చర్మాన్ని హీల్ చేసి అక్కడ దురదను తగ్గిస్తాయి. బేకింగ్ సోడా ఉపయోగించేందుకు కేవలం తలకు షాంపూ చేసే సమయంలో షాంపూ లో కాస్త బేకింగ్ సోడా కలిపి తలస్నానం చేస్తే సరిపోతుంది.

4. వేపాకు : చాలా చర్మరోగాలకు వేపాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంతో ఇది డాండ్రఫ్ సమస్యను సమర్థవంతంగా తగ్గించేస్తుంది. అయితే వేపాకుని బాగా నూరి ఆ తరువాత దాన్ని కాస్త వేడి నీటిలో కలిపి తలకు పట్టించి మెల్లగా మర్దన చేయాలి. అయితే వేపాకు జ్యూస్ ని డైరెక్ట్ గా తలకు పట్టించకూడదు. అలా చేస్తే.. తలలో మంట కలిగే అవకాశముంది. లేదా నీమ్ షాంపు కూడా ఉపయోగించవచ్చు.

Also Read: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

5. టీ ట్రీ ఆయిల్ : టీ ట్రీ ఆయిల్ లో యాంటీ ఆక్నె (మొటిమల బ్యాక్లీరియా), యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం షాంపులో రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించి ఆ తరువాత తలస్నానం చేయండి. రెండు, మూడు సార్లు ఇలా చేసిన తరువాత మంచి ఫలితాలు కనిపిస్తాయి.

6. వెల్లులి : వెల్లులిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో శతాబ్దాలుగా ఇది భారతీయ సంప్రదాయ ఔషధంగా ఉపయోగపడుతోంది. కేవలం రెండు వెల్లులి రెబ్బలు బాగా క్రష్ చేసి ఆ పేస్ట్ ని నీటిలో కలిపి తలకు పట్టించండి. అతి తక్కువ సమయంలోనే డాండ్రఫ్ సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ వెల్లులి ఘాటు వాసన మీకు పడకపోతే అందులో కాస్త తేనె, అల్లం(పేస్ట్) కలిపి కూడా ఉపయోగించవచ్చు.

Also Read: మొటిమలను గిల్లితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తో ప్రమాదం.. మీ అందం కాపాడుకోండిలా..

7. అలోవేరా : అలోవేరాలో చర్మాన్ని కూల్ చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంతో పాటు.. ఇది చర్మాన్ని కాస్త ఎక్స్‌ఫోలియేట్ కూడా చేస్తుంది. అలోవేరా మొక్క నుంచి డైరెక్ట్ గా అలోవేరా కొమ్మలు తీసుకొని.. అందులో నుంచి ఆలోవేరా జ్యూస్ తీసుకోండి. ఇది చాలా గాఢంగా ఉంటుంది గనుక ఏదైనా డాండ్రఫ్ షాంపులో కలిపి ఉపయోగించండి. తీవ్ర డాండ్రఫ్ సమస్య ఉన్న వారికి వెంటనే దురద, మంట తగ్గిపోతుంది.

పై చెప్పిన ఇంటి చిట్కాలు పాటించి.. నాచురల్ పద్ధతిలో డాండ్రఫ్ సమస్యకు గుడ్ బై చెప్పండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×