BigTV English

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Sleep deprivation liver damage: నిద్ర తక్కువైతే లివర్ డ్యామేజ్!.. ఇవే లక్షణాలు..

Sleep deprivation liver damage| ఆరోగ్యకరమైన జీవితం కలిగినవారు ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతులు. అయితే మంచి ఆరోగ్య కోసం.. మంచి పోషకాహారం ఎంత ముఖ్యమో.. మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగాలేకపోతే అన్నింటి ఎక్కవగా లివర్ (కాలేయం)గా ప్రభావం పడుతుంది. ఎక్కువ కాలం సరిపడ నిద్ర లేకపోతే లివర్ సిర్‌హోసిస్ అనే ఆరోగ్య సమస్య తలెత్తే ప్రమాదముంది. చైనాలోని హుయాఝాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేసిన అధ్యయనంలో నిద్ర లేమితో నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదముందని తేలింది.


నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ తో బాధపడే వారిపై చేసిన ఈ అధ్యయనం చేయగా.. 1,12,196 మంది బాధితులు సరిపడ సమయంల నిద్రపోవడం లేదని తేలింది. పైగా వారిలో లివర్ సిర్‌హోసిస్ సమస్య పెరుగుతోందని తెలిసింది. కానీ అధ్యయనంలో పాల్గొన్నవారిలో కొంతమంది ఆ తరువాత సరిపడ సమయం నిద్రపోవడం ప్రారంభించినప్పటి నుంచి వారి ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు పరిశోధకులు తెలిపారు.

అయితే హెపటాలజీ ఇంటర్నేష్నల్ సంస్థ ప్రకారం.. మంచి నిద్రపోయే వారిలో వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు ఉండవు, పైగా వారి జన్యువులకు కూడా తక్కువ ఆరోగ్య సమస్యలుంటాయి.


నిద్రభంగంతో లివర్ సిర్‌హోసిస్
నిద్ర పోతున్న సమయంలో తరుచూ మెలుకువ వచ్చే వ్యక్తులకు లివర్ సిర్‌హోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా లివర్ లో ఏదైనా సమస్య వస్తే అది తనంటే తనే రిపేర్ అయిపోతుంది. అయితే అందుకు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ.. తగినంత సేపు నిద్రపోవాలి. కానీ ఎక్కువ కాలం లివర్ లో సమస్య ఉంటే సిర్‌హోసిస్ వ్యాధి మొదలవుతుంది. ముందుగా లివర్ పై స్కార్ టిష్యూ ఏర్పడుతుంది. ఈ స్కార్ టిష్యూ లివర్ పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఈ సిర్‌హోసిస్ సుదీర్ఘకాలం ఉంటే లివర్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది.

Also Read:  టెటనస్ వ్యాక్సిన్ తీసుకోగానే సీరియస్ రియాక్షన్.. చావుబతుకుల్లో యువతి

లివర్ సిర్‌హోసిస్ ఒక క్రానిక్ వ్యాధి. సుదీర్ఘ కాలం లివర్ డ్యామేజ్ ఉండడం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు లివర్ లోని ఆరోగ్యకరమైన టిష్యూలు ఒక్కొక్కటిగా చనిపోవడం జరుగుతుంది. చివరికి లివర్ ఫెయిల్ అవుతుంది. లివర్ సిర్‌హోసిస్ ని తెలుసుకోవడానికి చాలా లక్షణాలున్నాయి.

లివర్ సిర్‌హోసిస్ లక్షణాలు

తరుచూ వాంతులు కావడం
ఆకలి లేకపోవడం
అలసిపోయినట్లు అనిపించడం
కామెర్లు రావడం
బరువు తగ్గడం
దురద
పొత్తికడుపులో ద్రవం పేరుకుపోవడం
మూత్రం రంగు నల్లబడటం
జుట్టు రాలడం
ముక్కు నుంచి రక్తం కారడం
కండరాల తిమ్మిరి
తరచుగా జ్వరం
జ్ఞాపకశక్తి తగ్గిపోవడం

లివర్ ఆరోగ్యానికి నిద్రతో డైరెక్ట్ కనెక్షన్
లివర్ డాక్ అని ప్రాచుర్యం పొందిన ఎబ్బి ఫిలిప్స్ అనే వైద్య నిపుణుడు నిద్ర, లివర్ కనెక్షన్ పై మాట్లాడుతూ.. ”మనుషులు నిద్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఇస్తారు. జన్యుపరంగా సమస్యలుంటే వాటిని చికిత్స అందించడం కష్టం. కానీ ప్రతిరోజు రాత్రి మంచిగా నిద్రపోవడం ప్రతి మనిషి చేతిలో ఉంది. 7-8 గంటలపాటు నిద్రపోతే దాన్ని ఆరోగ్యకరమైన నిద్ర అని అంటారు దాని వల్ల శరీరమంతా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. పైగా దీని వల్ల లివర్ కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది.” అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×