Pomegranate Leaves: పండ్లతో ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పండ్లు మాత్రమే కాకుండా వాటి ఆకులతోను ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా దానిమ్మ పండు మాత్రమే కాకుండా ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దానిమ్మ ఎరుపు రంగులో ఉంటుంది. బయట మాత్రమే కాకుండా లోపల ఉండే గింజలు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి చిన్నగా గుండ్రటి ఆకారంలో ఉంటాయి. అయితే దానిమ్మ పండును కేవలం తినడానికి మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఔషధంలా ఉపయోగిస్తారు. అయితే పండుతో మాత్రమే కాకుండా ఆకులతో ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దానిమ్మ ఆకులను కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. దానిమ్మ ఆకులను తీసుకోవడం వల్ల చర్మ రోగానలు నివారించవచ్చు. అంతేకాదు కుష్టు వ్యాధి ఉన్న వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మరోవైపు దీని కషాయం వర్షకాలంలో రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
చెవి సమస్యలతో బాధపడే వారు అంటే ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలు ఉన్న వారికి దానిమ్మ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ఆకుల రసంలో నువ్వుల నూనెను కలిపి రెండు చుక్కలు రాసుకోవడం వల్ల చెవి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు తామర, గజ్జి వంటి సమస్యలు ఉన్న వారు ఆ స్థలంలో దానిమ్మ ఆకుల పేస్ట్ ను అప్లై చేయడం వల్ల నయం చేస్తుంది. అంతేకాదు శరీరంపై గాయాలు, పుండ్లు వంటివి ఏర్పడిన చోట కూడా ఈ పేస్ట్ అప్లై చేయడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు.
మరోవైపు నిద్రలేమి సమస్యతో బాధపడే వారు దానిమ్మ ఆకుల కషాయాన్ని కొన్ని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. ఇక నోటి సమస్యలు ఉన్న వారు కూడా దానిమ్మ ఆకులను తీసుకుంటే నోటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు దుర్వాసన,. చిగుళ్ల సమస్యలు, పుండ్లు వంటి వాటికి కూడా ఆ రసాన్ని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది. ముఖంపై మొటిమలు ఉన్న వారు కూడా దానిమ్మ ఆకులతో తయారుచేసిన పేస్ట్ ను మొటిమలపై రాసుకోవడం వల్ల తగ్గిపోతాయి. ఇక జీర్ణ సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)