BigTV English

Cluster Fig Tree Benefits : ఈ చెట్టు కనిపిస్తే కాయలు వదలకండి.. ఎందుకంటే!

Cluster Fig Tree Benefits : ఈ చెట్టు కనిపిస్తే కాయలు వదలకండి.. ఎందుకంటే!

Cluster Fig Tree Benefits : భూ ప్రపంచంలో అనేక లక్షల రకాలైన వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాల వల్ల మానవులకు వచ్చే అనేక వ్యాధులను నయం చేయచ్చు. ఇవి మన శరీరానికి ఔషధంగా ఉపయోగపడతాయి. ఇందులో మేడి చెట్టు కూడా ఒకటి. అంతేకాకుండా చెట్టు పూలు, బెరడు, ఆకులు, పండ్లు ఆరోగ్యానికి అద్భతంగా పనిచేస్తాయి. మేడి చెట్టు పువ్వు చాలా అరుదుగా లభిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని తాపచెట్టు అని కూడా అంటారు. జార్ఖండ్‌లో దీనిని దుమూర్ అని కూడా అంటారు.


మేడి చెట్టు పండ్లు, ఆకులు, బెరడు చాలా ప్రయోజనకరమైనవి. పండులో విటమిన్ బి2, కాపర్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా అనేక వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మేడి చెట్టు కొన్ని వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఆ వ్యాధులు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : ఈ నాలుగు రకాల చేపలను తినకండి..?


తలనొప్పి

తలనొప్పి నుండి ఉపశమనాన్ని అందించే ఔషధ మూలకాలు మేడిచెట్టు ఆకులలో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రమైన శెనగపిండి, ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా శెనగపిండి రసం, తేనె కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

Figs Benefits
Figs Benefits

వాపు సమస్య

కాళ్ల నొప్పులు, వాపులతో బాధపడేవారు మేడి చెట్టు బెరడును మెత్తగా నూరి వాపు ఉన్న చోట రాస్తే వాపు సమస్య పోతుంది. ఎందుకంటే ఈ చెట్టు బెరడులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి తగ్గేందుకు సహాయపడతాయి. వాపును సులభంగా తగ్గిస్తాయి.

రక్తస్రావం

విటమిన్ సి, ఐరన్, పొటాషియం వంటివి మేడి పండులో పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్తస్రావం తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తస్రావం సమస్య దీని వినియోగం ద్వారా నయమవుతుంది.

యూరిన్ ఇన్‌ఫెక్షన్

మేడి పండులో ఉండే ఔషధ గుణాలు ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలానే వీటి పూలలో ఉండే విటమిన్ సి ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. దీని కోసం పూలను కూరగా తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం లభిస్తుంది.

Also Read : ఎవరైనా మీ చెవుల్లో ఈలలు వేస్తున్నట్లు అనిపిస్తుందా..?

పైల్స్

పైల్స్ వ్యాధిగ్రస్తులు మేడిపండును ఎండబెట్టి మెత్తగా పొడి చేయాలి. తర్వాత రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా చక్కెరని కలిపి తాగడం వల్ల పైల్స్ నొప్పి, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×