BigTV English

Promise Day : మీ లవర్‌కి ఇలా ప్రామిస్ చేయండి..!

Promise Day : మీ లవర్‌కి ఇలా ప్రామిస్ చేయండి..!

Promise Day Special : వాలెంటైన్ వీక్‌లో ఐదవ రోజు అంటే ఫిబ్రవరి 11న ప్రామిస్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైనది. మీ భాగస్వామికి ప్రామిస్ చేయడానికి ఈ రోజును అంకితం చేయబడింది.
ఏ రిలేషన్‌లో అయినా నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకం ఉంటేనే ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్‌గా ఉంటుంది. కాబట్టీ మీకు ఇష్టమైన వారితో ఈ ప్రామిస్ డేను గొప్పగా జరుపుకోండి.


ప్రామిస్ అనేది రిలేషన్‌ను బ్రేక్ చేయడానికి కాదు. మీరు తప్పు చేసిన ప్రతిసారి జీవితంలో ఈ ప్రామిస్‌లు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. ప్రామిస్ అనేది ఒక పదం అయినప్పటికీ చాలా విషయాలను గుర్తు చేస్తుంది. మీ రిలేషన్‌లో నమ్మకం, విశ్వాసం, విధేయుతను తెస్తుంది. ఒకరిపై నమ్మకం కలగడానికి సంవత్సరాల టైమ్ పట్టినా.. అది పోవడానికి రెండు సెకన్లు చాలు. కాబట్టి మీరు ప్రామిస్ చేసినప్పుడు ఎంత కష్టమొచ్చిన దాన్ని బ్రేక్ చేయొద్దు.

Read More: ప్రపోజ్ డే.. ఇలా మీ ప్రియమైన వారిని ఇంప్రెస్ చేయండి..!


మనసుకు నచ్చిన వారికోసం కొన్ని వాగ్దానాలు చేయక తప్పదు. వాగ్దానాలు చేయడమే కాదు.. తూచా తప్పకుండా పాటించాలి. మీ భాగస్వామి మీదున్న ప్రేమను, నమ్మకాన్ని ప్రామిస్ చేసి నిలబెట్టుకోండి. ప్రామిస్ అనేది ఎదుట వ్యక్తిపై ఉన్న ప్రేమ, సంరరక్షణను తెలుపుతుంది.

  • నేను నిన్ను ప్రేమిస్తున్నాను మరియు ఎప్పటికీ ఇలానే ప్రేమిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను
  • సమ్యలు ఎన్ని వచ్చినా ఎప్పుడు నేను నీ పక్షానే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను
  • నిన్ను సురక్షితంగా ఉంచుతామని నేను ప్రామిస్ చేస్తున్నాను. నిన్ను నా లక్కీ‌గా భావిస్తానని మాట ఇస్తున్నాను
  • ఎల్లప్పుడూ నాకు మద్దతు నిలుస్తారని, నా నమ్మకాన్ని ఎప్పుడు బలపరుస్తానని నాకు ప్రామిస్ చేయండి
  • నా నుండి ఉత్తమమైనదాన్ని తీసుకువస్తారు. అందుకే మీరు నా జీవితంలో ఉండండి, మనం భూమిపై స్వర్గాన్ని చేసుకుందాం
  • ఎటువంటి అంచనాలు లేకుండా నేను మీ కోసం శ్రద్ధ వహిస్తాను. నిన్ను ఎప్పటికీ సంతోషంగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాను
  • నువ్వు ఎప్పటికీ మరియు ఎల్లప్పుడూ నాతో ఉంటారని నాకు హామీ ఇవ్వండి. హ్యాపీ ప్రామిస్ డే

ఇటువంటి ప్రామిస్‌లు చేయండి. మీ ప్రేమకు నమ్మకాన్ని ఇవ్వండి. మీకు ఇష్టమైన వారికి మీ నమ్మకాన్ని తెలియజేయండి. ప్రామిస్ డే అంటే మీ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకుంటారని ఒకరికి ఒకరు ప్రామిస్ చేయడం. మీరు చేసే ఒక్క ప్రామిస్ మీ బంధాన్ని సంతోషంగా ఉంచుతుంది.

Tags

Related News

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Big Stories

×