Raw Milk For Skin: పచ్చి పాలు చర్మ సంరక్షణకు చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. చలికాలంలో ముఖ చర్మం పొడిబారడం సర్వసాధారణం. అయినప్పటికీ, పచ్చి పాలను అనేక విధాలుగా ఉపయోగించడం ద్వారా చర్మం గ్లో , తేమను పెంచుకోవచ్చు. పచ్చి పాలలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ముఖ కాంతిని పెంచే సమ్మేళనాలు ఉంటాయి.
పచ్చి పాలు చర్మానికి సహజమైన, సమర్థవంతమైన చికిత్స అని చెప్పవచ్చు. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియంట్ అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.
పచ్చి పాల వల్ల కలిగే ప్రయోజనాలు:
మొటిమలను తగ్గిస్తాయి: పచ్చి పాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.
చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది: పాలలో ఉండే కొవ్వు, ప్రోటీన్లు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.
చర్మాన్ని ఫెయిర్‌గా చేస్తుంది: రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల పచ్చి పాలు చర్మాన్ని ఫెయిర్‌గా , మెరిసేలా చేస్తుంది.
చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది: లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
చర్మాన్ని టోన్ చేస్తుంది: పచ్చి పాలు చర్మ రంధ్రాలను మూసివేయడం ద్వారా చర్మాన్ని టోన్ చేస్తుంది.
పచ్చి పాలను ఎలా ఉపయోగించాలి ?
క్లెన్సర్‌గా: పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని సున్నితంగా శుభ్రం చేయండి. ఇది మేకప్, మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. వీటిని తరుచుగా వాడటం వల్ల ముఖం తెల్లగా మెరిసిోతుంది. గ్లోయింగ్ స్కిన్ కోసం పాలు చాలా బాగా ఉపయోగపడతాయి.
ముఖానికి మాస్క్‌లా: పచ్చి పాలలో పసుపు లేదా శనగపిండిని కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మొటిమలు , మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.
టోనర్‌గా: పచ్చి పాలలో రోజ్ వాటర్ కలపడం ద్వారా టోనర్‌ను తయారు చేయండి. దీన్ని కాటన్ సహాయంతో ముఖానికి పట్టించాలి. ఇది చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా ముఖానికి పోషణను అందిస్తుంది.
స్క్రబ్ లాగా: పచ్చి పాలలో పంచదార లేదా ఓట్స్ మిక్స్ చేసి స్క్రబ్ చేయండి. దీన్ని ముఖంపై సున్నితంగా మసాజ్ చేసి కడిగేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
Also Read: పొడవాటి జుట్టు కోసం.. ఇలా చేయండి
కొన్ని అదనపు చిట్కాలు
ప్యాచ్ టెస్ట్: పచ్చి పాలను ముఖానికి పూసే ముందు, చేతిపై ఒక ప్రదేశంలో ప్యాచ్ టెస్ట్ చేయండి.
పచ్చి పాలను మాత్రమే వాడండి: పాశ్చరైజ్డ్ పాలలో ఈ లక్షణాలు ఉండవు.
క్రమం తప్పకుండా ఉపయోగించండి: ఉత్తమ ఫలితాల కోసం పచ్చి పాలను క్రమం తప్పకుండా ఉపయోగించండి.
ఇతర పదార్థాలు: మీరు పచ్చి పాలలో తేనె, ముల్తానీ మిట్టి లేదా పెరుగును కూడా కలుపుకోవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.