South Korea Martial Law| దక్షిణ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ (Yoon Suk Yeol) మంగళవారం డిసెంబర్ 3, 2024న ఎమర్జెన్సీ సైనిక పాలన విధించారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు.. ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఉత్తర కొరియాతో కలిసి కుట్రలు చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
” కమ్యూనిస్టు ఉత్తర కొరియా శక్తుల నుంచి సౌత్ కొరియాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి, ప్రజల స్వాతంత్ర్యం, సంతోషాన్ని విద్రోహ శక్తుల కంబద హస్తాల్లో వెల్లకుండా నివారించేందుకు నేను ఈ క్షణం నుంచి ఎమర్జెన్సీ సైనిక పాలన ప్రకటిస్తున్నాను.” అని అధ్యక్షుడు యూన్ జాతీయా టివి ఛానెల్ ద్వారా జాతి నుద్దేశించి ప్రకటన చేశారు.
“ప్రజల ఉపాధి గురించి ఆలోచించకుండా కేవలం ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఉద్దేశంలో అధికారంలో ఉన్నవారిపై అవినీతి ఆరోపణలు చేయడం, వారిపై విచారణకు ఆదేశించడం.. కానీ ప్రతిపక్ష నాయకుడికి మాత్రం విచారణ నుంచి మినహాయింపు లభించడం. ఇదే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్నారు.” అని అధ్యక్షుడు యూన్ అన్నారు.
Also Read: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో రక్తపాతం.. 100 మంది మృతి!.. కారణాలివే..
సౌత్ కొరియా నేషనల్ అసెంబ్లీ (పార్లమెంటు)లో మొత్తం 300 మంది ఎంపీలుండగా.. అందులో అధ్యక్షుడు యూన్ సొంత పార్టీ ఎంపీలు చాలామంది ఆయనకు వ్యతిరేకంగా మారారు. దీంతో ప్రతిపార్టీల బలం భారీ గా పెరిగిపోయింది. తాజాగా నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడు యూన్ ప్రతిపాదించిన బడ్జెట్ ప్లాన్ ని ప్రతిపక్ష పార్టీ ఎంపీలు, రెబెల్ ఎంపీలు వ్యతిరేకించారు. ఆ బడ్జెట్ ఆమోదించక ముందు గత బడ్జెట్ ఖర్చుపై ఆడిట్ చేయించాలని.. తాజా బడ్జెట్ లో ప్రభుత్వ రిజర్వ ఫండ్, యూన్ కార్యాలయంపై అనవసర ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని చెప్పి.. బడ్జెట్ లో భారీగా కోతలు విధించారు.
నేషనల్ అసెంబ్లీలో తన పార్టీ తగిన బలం లేకపోవడంతో అధ్యక్షుడు యూన్ సైనిక పాలన విధించారు. అయితే ఆయన సైనిక పాలన ప్రకటన చేసిన 24 గంటలు గడవక ముందే సౌత్ కొరియాలో అతిపెద్ద పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎంపీ అత్యవసరంగా పార్లమెంటులో సమావేశమై అధ్యక్షుడు యూన్ విధించిన సైనిక పాలన వ్యతిరేకంగా ఓటింగ్ చేపట్టారు. దీంత 300 ఎంపీలలో 201 మందికి పైగా సైనిక పాలన ఉపసంహరించుకోవాలని ఓటు వేశారు. ఆ తరువాత పార్లమెంటు బయట బుధవారం డిసెంబర్ 4, 2024న ప్రతిపక్ష లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు లీ మే జియుంగ్ మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ అసెంబ్లీలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓటు ఆమోదం పొందింది. దీంతో నేషనల్ అసెంబ్లీ స్పీకర్ సైనిక పాలన ఉపసంహరణకు ఆదేశించారు. త్వరలోనే అధ్యక్షుడు యూన్ పై (Yoon Suk Yeol) అభిశంసన (అధికారం నుంచి తొలగించే ప్రక్రియ) చేపడతాం” అని అన్నారు.
సౌత్ కొరియా రాజ్యాంగం ప్రకారం.. యుద్ధం, యుధ్ద లాంటి పరిస్థితుల్లో శాంతి భద్రతల దృష్ట్యా సైనిక పాలనకు అధ్యక్షుడు ఆదేశించవచ్చు. ఆ సమయంలో మీడియాకు, కోర్టులకు అధికారాలు ఉండవు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులేవీ లేనప్పుడు అధ్యక్షుడు కేవలం తన ప్రభుత్వం కాపాడుకోవడానికే ఈ ప్రకటన చేశారని రాజకీయ నిపుణుల అభిప్రాయం.
కానీ నేషనల్ అసెంబ్లీలో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఓటు ఆమోదం పొందితే.. అధ్యక్షుడి ఆదేశాలు చెల్లుబాటుకావు.