Sachin – Vinod Kambli: టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టీమిండియా తరఫున ఎన్నో మ్యాచులు.. ఆడిన సచిన్ టెండూల్కర్ అనేక విజయాలను కూడా అందించారు. ఆయన ఖాతాలో వేల పరుగుల రికార్డు కూడా నమోదు కావడం జరిగింది. సెంచరీలు అలాగే హాఫ్ సెంచరీలు చేశారు సచిన్ టెండూల్కర్. అలాంటి సచిన్ టెండూల్కర్ క్రికెట్కు దూరం అయి… చాలా సంవత్సరాల అయిపోతుంది.
Also Read: Hardik on Ishan Kishan: SRHలోకి ఇషాన్ కిషన్.. అంబానీపై హార్దిక్ పాండ్యా హాట్ కామెంట్స్ !
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో బరిలోకి దిగాడు సచిన్ టెండూల్కర్. ఆ తర్వాత ఆ జట్టుకు మెంటర్ గా కొనసాగుతున్నాడు సచిన్ టెండూల్కర్. అయితే అప్పుడప్పుడు.. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా సచిన్ టెండుల్కర్ మెరుస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే… ఓ ఈవెంట్ కి వెళ్లారు సచిన్ టెండూల్కర్. ఈ సందర్భంగా తన చిన్ననాటి స్నేహితుడు వినోద్ కాంబ్లీ ని కలిశారు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్.
అయితే సచిన్ టెండూల్కర్ ను చూసిన తర్వాత… వినోద్ అతన్ని గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత సచిన్ టెండూల్కర్ ను గుర్తుపట్టడం జరిగింది. ఆ తర్వాత సచిన్ అలాగే వినోద్ ఇద్దరూ ముచ్చటించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివాజీ పార్క్ లో…కోచ్ రమాకాంత్ అచరేకర్ స్మారకాన్ని… లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సచిన్ టెండూల్కర్ వెళ్లారు. ఇక ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే కూడా వెళ్లడం జరిగింది. ఇక ఇదే కార్యక్రమంలో సచిన్ అలాగే వినోద్ కలుసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఇద్దరు మాజీ క్రికెటర్లు. సచిన్ అలాగే వినోద్ ఇద్దరూ కూడా రమాకాంత్ శిష్యులు కావడం గమనార్హం.
Also Read: MS Dhoni Sakshi Dance: భార్య సాక్షితో కలిసి ధోనీ డాన్స్…వీడియో వైరల్
రమాకాంత్ శిక్షణలోనే ఈ ఇద్దరు క్రికెటర్లుగా ఎదిగారు. కానీ ఇందులో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సక్సెస్ అయితే వినోద్ మాత్రం అట్టర్ ప్లాప్.. కావడం జరిగింది. అతని జీవితం ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారయింది. వినోద్ ఆర్థికంగా కూడా చాలా వెనుకబడ్డాడట. అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని సమాచారం. నడవలేని స్థితిలో వినోద్ ఉన్నాడు.
ఈ తరుణంలోనే రమాకాంత్ ఈవెంట్ లో… వినోద్ ను చూడగానే భావోద్వాగానికి గురైన సచిన్… అతని చేయి పట్టుకొని స్టేజ్ పైకి తీసుకువెళ్లాడు. చెయ్ పట్టుకొని మాట్లాడిన తర్వాత సచిన్ ను గుర్తుపట్టాడు వినోద్. ఆ తర్వాత సచిన్ చేయి వదలకుండా అలాగే పట్టుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.