BigTV English

Meaty Rice : మాంసం బియ్యం.. ఇవి తింటే మాంసం తిన్నట్లే..!

Meaty Rice : మాంసం బియ్యం.. ఇవి తింటే మాంసం తిన్నట్లే..!

South Korea Developed Meaty Rice


South Korea Developed Meaty Rice : చాలామంది శాకాహారులు ప్రోటీన్ లోపంతో బాధపడుతుంటారు. వీరికి జీవహింస చేయడం ఇష్టం ఉండదు. జంతువులను చంపడం భరించలేరు. అయితే ఇటువంటి వారి కోసమే దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. జంతువులను చంపకుండానే మాంసం పొందవచ్చని తెలిపారు. మాంసంతో కూడిన కొత్త రకం బియ్యాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని మీట్ రైస్, హైబ్రిడ్ రైస్ అంటున్నారు.

ఈ బియ్యపు గింజల్లో పశు మాంసంలో ఉండే కొవ్వు కణాలు ఉంటాయి. చూడటానికి గులాబీ రంగులో ఉంటాయి. వీటికోసం ముందుగా బియ్యపు గింజలకు చేపల నుంచి తీసిన జిగరులాంటి పదార్థాన్ని పూస్తారు. దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుక్కుపోతాయి. తరువాత వాటిని 11 రోజులపాటు ఓ పాత్రలో సాగు చేయగా మాంసం కణాలు బియ్యం చుట్టూ పలుచని పొరగా ఏర్పడతాయి.


READ MORE : పెయిన్ కిల్లర్స్ ఎలా పని చేస్తాయో తెలుసా?.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే!

దక్షిణ కొరియాలోని యోన్‌సై యూనివర్సిటీకి చెందిన బృందం చేసిన పరిశోధనల ప్రకారం.. ఈ హైబ్రిడ్ బియ్యం సాధారణ బియ్యంతో పోలిస్తే.. కొంచెం పెళుసుగా ఉంటాయి. కానీ ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయి. ఈ బియ్యంలో మాంసకృత్తులు 8శాతం అధికంగా ఉంటాయని తెలిపారు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు.

సాధారణ పశుమాంసంతో పోల్చితే.. ఇందులో కర్బన ఉద్గారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. దీనివల్ల పెద్ద సంఖ్యలో పశుపోషణ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇందులో 8 శాతం ప్రోటీన్‌, 7 శాతం కొవ్వులు ఉంటాయని అన్నారు. ఈ బియ్యంయ పశుమాంసం, బాదం వంటి వాసనను కలిగి ఉంటుంది.

ప్రయోగశాలలో తయారు చేసిన ఈ హైబ్రిడ్ బియ్యాన్ని ప్రోఫెసర్‌ జింకీ హాంగ్‌ రుచి చూశారు. చూడటానికి సాధారణ బియ్యం వలే గులాబీ రంగులో ఉంటాయి. కానీ మాంసపు లక్షణాన్ని కలిగి ఉందన్నారు. సువాసన కూడా ఉన్నట్లు తెలిపారు. కానీ ఇవి కొంచెం దృఢంగా పెళుసుగా ఉన్నాయని అన్నారు.

READ MORE : పెంపుడు జంతువులు అంటే ఇష్టమా?.. డేంజర్ డిసీజెస్!

ఈ బియ్యం ఉత్పత్తి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జంతువుల నుంచి 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే దాదాపు 50 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని అన్నారు. . మీట్ రైస్ నుంచి అదే మొత్తంలో ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తే 6.27 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ మాత్రమే విడుదల అవుతుందని తేల్చారు.

అయితే ఈ హైబ్రిడ్ బియ్యం స్వచ్ఛమైన శాకాహారం కాదు. ఎందుకంటే ఇందులో జంతు కణాలు ఉంటాయి. మాంసాహార రుచిని మాత్రమే ఇస్తాయి. మార్కెట్లో ఇవి విడుదల చేస్తే ప్రజలు వీటిని ఇష్టపడతారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇటువంటి ఆహారం కరువు వచ్చినప్పుడు ప్రజల ఆకలి తీర్చేందుకు, సైనిక అవసరాలకు, లేదంటే అంతరిక్షంలో గడిపే వారికి పనికొస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×