BigTV English
Advertisement

Summer Children Health : సమ్మర్.. మీ పిల్లల హెల్త్ ఇలా కాపాడండి..!

Summer Children Health : సమ్మర్.. మీ పిల్లల హెల్త్ ఇలా కాపాడండి..!

Summer Children Health Care Tips : సమ్మర్ అనగానే పిల్లలకు ఎక్కడేలేని ఆనందం. ఎందుకంటే వేసవిలో పాఠశాలలు సెలవులు ఉంటాయి. ఎంచక్కా హాయిగా ఆడుకోవచ్చు. సమ్మర్‌లో పిల్లలకు ఆటలు తప్పా మరే ఆలోచన ఉండదు. వారిని
కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుంది తల్లిదండ్రులకు. అయితే పిల్లులు సమ్మర్‌లో చాలా అశుభ్రంగా ఉంటారు. శుభ్రత పట్ల శ్రద్ధ చూపరు. దాని వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.


సమ్మర్‌లో పిల్లలు ఎక్కువగా ఇంటికి దూరంగా గడుపుతారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల హీట్ స్ట్రోక్, హీట్ ర్యాష్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎండలో పిల్లలు ఎక్కువగా గడపడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపకుండా ఉండాలి వారికి మంచి ఆహారం అందించాలి.

పిల్లలు తగినంత నీరు తాగేలా చూడాలి. లేదంటే డీహైడ్రేషన్‌కు గురై శక్తిని కోల్పోతారు. ముఖ్యంగా పిల్లలు జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండేలా చూసుకోండి. వీటివల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.అందువల్లనే పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు.


Read More : జాగ్రత్త.. సీజన్ మారుతోంది..!

సమ్మర్‌లో పిల్లలు మంచి నీరు తీసుకునేలా చూడాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కలుషిత నీరు వల్ల టైఫాయిడ్, డయేరియా, కలరా, కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు కాచిన గోరువెచ్చని నీటిని ఇవ్వండి. బయటకు వెళ్లేప్పుడు వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి.

సమ్మర్‌లో ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ తాగేందుకు పిల్లలు ఇష్టపడతారు. వేసవిలో ఇవి తీసుకోవడం వల్ల గొంతునొప్పి వస్తుంది. కాబట్టి స్టాక్ చేసిన చల్లని పదార్థాల నుంచి పిల్లలను దూరంగా ఉంచండి.

వేసవిలో నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రవిసర్జనలోని ఏదైనా భాగంలో ఇన్ఫెక్షన్లు రావచ్చు. మూత్రాశయ సమస్యలు కూడా ఎదుర్కొంటారు. కాబట్టి పిల్లల శరీరానిక తగ్గట్టుగా వారికి నీరు అందించండి. వారి శుభ్రత పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి.

Read More : ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా..!

వేసవిలో కలుషిత ఆహారం లేదా నీటి వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. సూర్యరశ్మి, తేమతో కూడిన వాతావరణంలో ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా వృద్ది చెందుతుంది. దీని కారణంగా పిల్లలలో విరోచనాలు, కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి.

సూర్యరశ్మి ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడతారు. ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడాటానికి మంచి నీరు తాగాలి. పిల్లలకు ఎక్కువగా మజ్జిగ, నిమ్మకాయ రసం, పుచ్చకాయ వంటి పండ్ల రసాలు ఇవ్వండి. వీటిలో చక్కెర ఎక్కువగా లేకుండా చూడండి. పిల్లలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండకు వెళ్లకుండా చూడండి.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×