Big Stories

Summer Health Tips : జాగ్రత్త.. సీజన్ మారుతోంది..!

Follow These Tips For Summer

Follow These Tips For Summer (health news today):

- Advertisement -

చలికాలం కాబట్టి ఇన్ని రోజులు దుప్పటి నిండా కప్పుకొని పడుకుని ఉంటాము. ఇప్పుడు సీజన్ మారింది. కప్పిన దుప్పట్లను పక్కనేయండి. ఫిబ్రవరిలోనే సమ్మర్ వచ్చేసింది. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. పగలు వేడి విపరీతంగా ఉన్నా.. అర్ధరాత్రి దాటక కాస్త వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే సీజన్‌కు అనుగుణంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

- Advertisement -

సమ్మర్ అనగానే మనం ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగడానికి ఇష్డపడతాము. కూల్‌డ్రింక్స్ తీసుకునే ముంందు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పగలు వేడిగా ఉందని కూల్‌డ్రింక్స్ తాగితే రాత్రి జలుబు చేస్తుంది. దీని నుంచి బయటపడేందుకు మీ గది ఉష్ణోగ్రతకు తగిన నీటిని తాగితే సరిపోతుంది.

ఇటువంటి నీటిని తాగడం వల్ల జలుబు, ముక్కు దిబ్బడ రాకుండా ఉంటాయి. వేపుళ్లు, కారాలు, మసాలాలు మానేయాలి. అందులోనూ ముఖ్యంగా బిర్యానీలు, ఊరగాయలను అసలు తినకపోవడం మంచిది. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Read More : మీ శరీరంపై ఉన్నవి పుట్టుమచ్చలా?.. క్యాన్సర్ మచ్చలా?

సీజన్‌తో సంబంధం లేకుంగా కొందరికి జలుబు చేస్తుంది. అది తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది. అటువంటి వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు రోగనిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. వారి ఆహారంలో విటమిన్ ఎ,సి ఉండేలా చూసుకోవాలి.

మీ శరీరంలోని వైరస్‌లను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారమే ఉత్తమైన మార్గం. మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు తీసుకోండి. పండ్ల రసాలు, ఆకుకూరలు, సూప్‌లు తీసుకోవచ్చు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని నైట్ డిన్నర్‌లోకి తీసుకోండి.

రోజుకి 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగడం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగితే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. శరీరంలో ద్రవాలు తగ్గకుండా.. నీరు, నిమ్మకాయ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగండి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్‌‌గా ఉంటుంది.

Read More : డయాబెటీస్.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ మిస్టేక్స్ చేయకండి..!

సమ్మర్‌లో ముఖ్యంగా బయటతిరగడం తగ్గించండి. బయటకు వెళ్లాల్సి ఉంటే సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాల నుంచి శరీరాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం సన్‌స్క్రీన్ లోషన్ మీ చర్మానికి రాసుకోండి. కాటన్ దుస్తులను ధరించండి. సమ్మర్‌లో పాదాలను కూడా రక్షించుకోండి.

సమ్మర్‌లో చల్లని నీటితో మీ శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. లేదంటే చెమట వల్ల మీ శరీరం పాడవుతుంది. చర్మంపై గుల్లలు వస్తాయి. రోజుకు రెండు సార్లు చల్లని నీటితో స్నానం చేయండి. స్నానపు నీటిలో వేపాకులు వేసుకొని కొద్ది సేపటి తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది.

సూర్యుని నుంచి మీ శరీరాన్ని రక్షించుకునేందుకు ఎండ తగతకుండా శరీరం కవర్ అయ్యేలా దుస్తులు ధరించండి. తలకు క్యాప్‌లు, స్కార్ఫ్ వంటివి ధరించండి. బయటకు వెళ్తుంటే మీ వెంట ఎప్పుడూ కూడా ఒక వాటర్ బాటిల్‌ను ఉంచుకోండి. ఎందుకంటే సమ్మర్‌లో ఎక్కువగా దాహం వేస్తుంది. శరీరంలో నీటి నిల్వలు తగ్గితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News