Big Stories

Cotton Candy Ban : పీచు మిఠాయి బ్యాన్.. అసలు కారణం తెలుసా..!

cotton candy ban

- Advertisement -

Cotton Candy Ban : పీచు మిఠాయి. ఇది చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. సైకిల్‌పై గంట కొడుతూ పీచు మిఠాయి.. పీచు మిఠాయ్ అంటుంటే.. ఎవరికైనా నోరు ఊరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు దీన్ని ఇష్టపడని వారుండరు. ఈ పీచు మిఠాయ్‌ని కాటన్ క్యాండీ అని కూడా పిలుస్తారు.

- Advertisement -

అయితే తాజాగా తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు నిషేధం విధించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని నిషేధించే అవకాశం ఉంది. పీచుమిఠాయి ప్రజల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తాజాగా జరిపిన పరిశధనల్లో తేలింది. దీంతో ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More : ఇన్‌ఫ్లుఎంజా వైరస్.. ఈ నెలలోనే విజృంభణ..!

పీచు మిఠాయిని చాలా రకాలుగా పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పీచు మిఠాయి అంటారు. అయితే దీన్ని ఈ పీచు మిఠాయిని ఒక రకమైన చక్కెరతో తయారు చేస్తారు. ఆ చక్కెరను షుగర్ సిరప్ నుంచి తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ఒక చిన్న రంధ్రం ఉన్న మిషన్‌లో వేస్తారు. అపుడు దాని నుంచి పొగలు పొగలుగా మిఠాయి బయటకు వస్తుంది.

పీచు మిఠాయిని అనేక రంగుల్లో తయారు చేస్తారు. కానీ ఇటీవల కొందరు వ్యాపారులు అధిక లాభాలకు ఆశపడి అత్యంత విషపూరితమైన రసాయానాలతో దీన్ని తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీనిలో రోడమైన్ బి అనే డేంజరస్ కెమికల్ ఉన్నట్లు తేల్చారు.

పీచు మిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు నిర్ధారించారు. వీటి తయారీ, ప్యాకేజింగ్, దిగుమతి, విక్రయించడం లేదా వివాహాలు, ఇతర కార్యక్రమాలలో రోడమైన్-బితో తయారయ్యే ఆహార పదార్థాలను ఉపయోగించడం ఆహార భద్రత చట్టం ప్రకారం విరుద్దమని తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు వెల్లడించాయి.

Read More : ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నారా? ..ఈ చికిత్సలతో చెక్ పెట్టండి..!

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పీచు మిఠాయిని పరీక్షించేందుకు జిల్లాల నుంచి శాంపిళ్లను సేకరించాలని అధికారులను ఆదేశించింది. సేకరించిన పీచు మిఠాయి శాంపిల్స్‌ను టెస్టింగ్‌కు పంపనున్నట్లుగా స్టేట్ హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నివాస్ తెలిపారు.

టెస్టుల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా నిషేధం విధించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వెల్లడించారు. వీటి తయారీలో ఉపయోగించే సింథటిక్, నాన్ పర్మిటెడ్ రంగులు క్యాన్సర్ కారకమవుతాయని నిపుణులు చెబుతున్నారు. పీచు మీఠాయిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తారు.

Disclaimer : ఈ సమచారాన్ని హెల్త్ జర్నల్స్ ఆధారంగా, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News