Big Stories

Food Allergy : ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నారా? ..ఈ చికిత్సలతో చెక్ పెట్టండి..!

allergy

- Advertisement -

Food Allergy Treatment : మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మంచి ఆహారం తీసుకుంటే హెల్దీగా ఉంటారు. మంచి ఆహారం అనగానే మనలో చాలా మందికి చికెన్, చేపలు, పాలు, గుడ్లు గుర్తొస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంతమంది వీటిని తినాలంటే భయపడుతుంటారు. దీనికి కారణం ఫుడ్ అలర్జీ. కొన్ని ఆహార పదార్థాల వల్ల కొంతమందికి ఫుడ్‌ అలర్జీ వస్తుంది. చేపలు, మాంసమే కాదు ఫుడ్ అలర్జీ రావడానికి అనేక రకాల ఆహారాలు కారణం అవుతున్నాయి.

- Advertisement -

అయితే అలర్జీలను కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన, ప్రాణాంతక అలెర్జీకి దారి తీయొచ్చు. ఈ అలర్జీ ఒకే సమయంలో శరీరంలోని అన్నీ వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల గొంతులో మంటగా ఉంటుంది. అలానే శరీరాన్ని కొన్ని కీటకాలు కుట్టడం వల్ల కూడా ఇది వస్తుంది

Read More : ఇన్‌ఫ్లుఎంజా వైరస్.. ఈ నెలలోనే విజృంభణ..!

ఫుడ్ అలర్జీలను నివారించడానికి ఇమ్యునోథెరపీ వంటి వినూత్న చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఫుడ్ అలర్జీ ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో గుర్తించొచ్చు. ఫుడ్ అలర్జీలు బాధాకరమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచవ్యాప్తంగా 220 మిలియన్ల మంది ఫుడ్ అలర్జీతో బాధపడుతున్నట్లు ఒక నివేదిక చెబుతుంది. ఈ సంఖ్య ఎక్కువగా కూడా ఉండొచ్చు.

ఫుడ్ అలర్జీ అనేది కొన్ని సందర్భాల్లో అనాఫిలాక్సిస్‌కు కూడా దారితీయొచ్చు. నిపుణులు అభిప్రాయం ప్రకారం 170 కంటే ఎక్కువ ఆహారాలు అలర్జీలను కలిగిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనవి వేరుశెనగ, పాలు, గుడ్లు చేపలు. ఈ అలర్జీలు ఆహారం నుంచి శరీరంలో కలుస్తాయి. దీనివల్ల శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది ఫుడ్ అలర్జీ ప్రారంభ దశగా గుర్తించాలి.

ఫుడ్ అలర్జీ ఉన్నవారి చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు ఉంటాయి. ఇది ప్రమాదకరమైతే వాంతులవడం, విరేచనాలవడం, ఊపిరాడకపోవడం వంటివి జరుగుతాయి.

Read More : ఇలా చేయండి.. స్ట్రెస్ ఫ్రీ అవ్వండి

ఫుడ్ అలర్జీకి దశాబ్ధ కాలం నుంచి సబ్‌లింగ్యువల్, ఎపిక్యుటేనియస్ ఇమ్యునోథెరపీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కాలంలో జన్యు చికిత్స, మోనోక్లోనల్ యాంటీబాడీలను ఉపయోగించి అధునాతన చికిత్సలు చేస్తున్నారు.

Disclaimer : ఈ కథనం ఆరోగ్య నిపుణుల సలహాలు , పలు వైద్య పరిశోధనలు ఆధారంగా అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News