Health Tips: మారుతున్న జీవనశైలి అనేక వ్యాధులను కారణం అవుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం గుండెపోటు, షుగర్, రకరకాల క్యాన్సర్లతో పాటు అనేక రకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం అనేక మంది ఎదుర్కుంటున్న సమస్యల్లో అధిక రక్తపోటు సమస్య కూడా ఒకటి. ప్రతి మూడవ వ్యక్తిలో ఒకరు అధిక బీపీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు.
రక్తపోటుతో ఇబ్బందిపడేవారు మందులతో పాటు,వంటిట్లోని కొన్ని రకాల పదార్థాలు వాడటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మసాలా దినుసులు ఆహార రుచిని పెంచడమే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడే గుణాలను కలిగి ఉంటాయి.
అధిక రక్తపోటుతో ఇబ్బందిపడే వారు సహజ పద్ధతుల ద్వారా నియంత్రించాలనుకుంటే మసాలా దినుసులను ఉపయోగించవచ్చు. ఏ మసాలా దినుసులు రక్తపోటును నియంత్రిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చినచెక్క : దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క తరుచుగా తినడం వల్ల రక్త నాళాల్లో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. దాల్చిన చెక్కను టీ, కాఫీ లేదా పెరుగులో కలపడం తీసుకోవచ్చు.
వెల్లుల్లి : వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాల్లో ఉండే సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మీరు వెల్లుల్లిని పచ్చిగా తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా వంటకాల్లో ఎక్కువగా వెల్లుల్లిని ఉపయోగించినా కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.
అల్లం: అల్లంలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త నాళాలను సడలించడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అల్లంను టీ, సూప్ లేదా ఆహారంలో ఎక్కువగా ఉపయోగించడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.
కొత్తిమీర: కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.కొత్తిమీరను పొడి రూపంలో లేదా తాజా కొత్తిమీర ఆకుల రూపంలో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. రక్తపోటు కూడా చాలా వరకు అధుపులో ఉంటుంది.
Also Read: కల్తీ నెయ్యిని గుర్తించండిలా ?
పసుపు : పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్త నాళాలు వాపు నుండి నిరోధిస్తుంది. అంతే కాకుండా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.పాలలో పసుపు కలిపి త్రాగడం, లేదా ఆహార పదార్థాల్లో పసుపును వాడటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఈ మసాలా దినుసులు వినియోగించే మరిన్ని మార్గాలు..
టీ: దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లితో టీ తయారు చేసి త్రాగాలి.
వంట: కూరగాయలు, పప్పులు, సూప్‌లలో ఈ మసాలా దినుసులను ఉపయోగించండి.
సలాడ్ : సలాడ్ లో ఈ మసాలా దినుసులను కలిపి తినండి
స్మూతీ: స్మూతీలో ఈ మసాలాలు మిక్స్ చేసి తాగండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.