BigTV English
Advertisement

Health Care : కడుపులో క్రిములా..?

Health Care : కడుపులో క్రిములా..?

Stomach Pain : ‘మేడిపండు చూడు మైడిమై ఉండును.. పొట్టవిప్పు చూడు పురుగు లుండు’ అని వేమన చెప్పిన పద్యం మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ పద్యంలో చాలా వరకు నిజం ఉందని వైద్యులు చెబుతున్నారు. చాలా మంది పిల్లలు, పెద్దల తరచూ పొట్ట నొప్పితో బాధపడుతుంటారు. కొందరిలో అయితే.. మూత్ర విసర్జనలో నులిపురుగులు కనిపిస్తుంటాయి. రక్తహీనతకు 60 శాతం నులిపురుగులే కారణమట. సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి 19 సంవత్సరాల యువకుడి వరకు పొట్టలో పెరిగే పురుగులతో బాధపడుతుంటారు.


నులిపురుగులు, బద్దె పురుగులు, కొంకి పురుగులు, కొరడా పురుగులు లాంటివి మన పొట్టలో చేరుతాయి. వీటి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వీటిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 10న దేశ వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహిస్తుంది.

Read More : గోబీ మంచూరియా బ్యాన్..!


పొట్టలో నులిపురుగుల ఉండటం వల్ల రక్తహీనత, కడుపునొప్పి, ఆకలి మందగించడం, వాంతులు, వికారంగా ఉండటం, విరోచనాలు, మలమంలో రక్తం రావడం వంటి అనేక సమస్యలు వస్తాయి.

నులిపురుగులు మలం ద్వారా బయటకు వచ్చి మట్టిని కలుషితం చేస్తాయి. నులిపురుగు గుడ్లు మట్టిలో లార్వాగా ఉండి వృద్ధి చెందుతాయి. వీటిని లిల్లీ మేరీ అంటారు. పిల్లలు మట్టిలో ఆడుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వలన ఈ గుడ్లు లార్వాలు వారి పొట్టలోపలికి వెళ్తాయి. పిల్లలో చేరిన లార్వాలు, గుడ్లు.. క్రిములుగా వృద్ధి చెందుతాయి. ఇవి పిల్లలకు అనారోగ్యం కలిగిస్తాయి.

నులిపురుగులు కడుపులోని చిన్న ప్రేగుల్లోకి చేరుతాయి. ఇవి 5 నుంచి 10 సెం.మీల పొడవు ఉంటాయి. వీటి కారణంగా కడుపునొప్పి, డయేరియా వస్తుంది. కులుషితమైన నీరు, ఆహారం వల్ల ఇవి కడుపులోకి చేరుతాయి.ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌లు వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి జింక్, విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Read More : ఉదయాన్నే ఆ నీరు తాగితే.. అద్భుతమైన ఫలితాలు..!

నులిపురుగుల నివారణకు పిల్లలకు ఆరోగ్యకరమైన అలవాట్లను నేర్పించండి. వైద్యుల సలహా మేరకు ఆల్బెండజోల్ మాత్రలను మింగించండి. రక్తహీనత, నులిపురుగుల వంటి సమస్యలను అధిగమించవచ్చు. పిల్లల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటారు. ముఖ్యంగా మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×