Morning Habits: ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఉదయం సమయం చాలా ముఖ్యమైనది. సరైన అలవాట్లతో రోజును ప్రారంభించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఉదయం పూట కొన్ని రకాల అలవాట్లను మార్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అటువంటి మూడు ఎఫెక్టివ్ టాస్క్‌లను గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. వీటిని మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే అవలంబిస్తే బరువు వేగంగా తగ్గుతుంది. అంతే కాకుండా మీరు ఫిట్‌గా ఉండటమమమే కాకుండా చురుకుగా కూడా ఉంటారు.
ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం తప్పకుండా చేయాల్సిన పనులు
గోరువెచ్చని నీరు త్రాగాలి:
ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. గోరువెచ్చని నీరు మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా శరీరం నుండి చెడు పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కావాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి కూడా త్రాగవచ్చు. ఇలా ఉదయం పూట త్రాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
యోగా, స్ట్రెచింగ్ చేయండి:
ఉదయం నిద్ర లేవగానే లైట్ యోగా, స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు చురుగ్గా మారి రోజంతా శక్తివంతంగా ఉంటారు. సూర్య నమస్కారం, తడసనా , భుజంగాసనాలు వంటివి చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని సులభమైన యోగా ఆసనాలు బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. స్ట్రెచింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. రోజు 15-20 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల ఫిట్ గా ఉంటారు. స్ట్రెచింగ్ చేయడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా మీ శరీరం కూడా దృఢంగా ఉంటుంది.
Also Read: మీ కాళ్లు, చేతుల్లో ఈ లక్షణాలున్నాయా ? మీ శరీరంలో విటమిన్ బి12 తగ్గినట్లే !
ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తినండి:
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం. మీరు బరువు తగ్గాలని, ఫిట్‌గా ఉండాలనుకుంటే, ఖచ్చితంగా ప్రొటీన్లు అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి. ప్రోటీన్ మీ శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. అంతేకాకుండా మీ ఆకలిని నియంత్రిస్తుంది. మీరు గుడ్లు, మూంగ్ దాల్ చీలా, ఓట్స్ లేదా గ్రీక్ పెరుగు తినవచ్చు. ఇది కాకుండా, అల్పాహారంలో పండ్లు, గింజలు కూడా మీ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తాయి. ప్రోటీన్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎగ్స్ తినడం వల్ల శరీరానికి తగిన ప్రొటీన్ కూడా అందుతుంది. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే వ్యాధులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.