BigTV English

Hair Growth Tips: ఇలా చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Hair Growth Tips: ఇలా చేస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది

Hair Growth Tips: చలికాలంలో జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ సీజన్‌లో జుట్టు జిగటగా ఉండటానికి ప్రధాన కారణం గాలిలో తేమ లేకపోవడంతో పాటు , తలలో అదనపు నూనె పేరుకుపోవడం. ఈ సమస్యలను తొలగించడానికి కొన్ని రకాల హోం రెమెడీస్ వాడాలి.


ఇంట్లోనే ఉన్న కొన్ని రకాల పదార్థాలు జుట్టు పెరగడం కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఈ హోం రెమెడీస్ ను సింపుల్ గా తయారు చేసుకుని వాడవచ్చు. మరి చలికాలంలో ఎదురయ్యే జుట్టు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి ఎలాంటి హోం రెమెడీస్ వాడాలి. వాటి తయారీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అలోవెరా జెల్:
అలోవెరా స్కాల్ప్‌ను లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు జిడ్డుగా మారకుండా తేమగా మారుస్తుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిచ్చి వాటిని ఆరోగ్యవంతంగా చేస్తుంది.


ఎలా తయారు చేయాలి: దీన్ని చేయడానికి, తాజా కలబంద ఆకుల నుండి జెల్ తీయండి. తర్వాత పేస్ట్ లాగా అయ్యేలా బాగా కలపాలి. కావాలంటే మార్కెట్‌లో లభించే అలోవెరా జెల్‌ని కూడా ఉపయోగించవచ్చు.

అప్లై చేసే విధానం: ఈ జెల్‌ను స్కాల్ప్‌పై సున్నితంగా అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. ఇది మీ జుట్టును మృదువుగా మార్చడంతో పాటు మెరిసేలా కూడా చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :
ఆపిల్ సైడర్ వెనిగర్ స్కాల్ప్ యొక్క pHని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ఇది అదనపు నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును శుభ్రంగా మార్చడంతో పాటు మెరిసేలా కూడా చేస్తుంది. అలాగే, దీనిని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల జుట్టులోని మురికితో పాటు జిగురును తొలగిస్తుంది.

ఎలా తయారు చేయాలి: దీన్ని తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, 1 కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ వెనిగర్ బాగా కలపండి. సులువుగా ఉపయోగించుకునేలా శుభ్రమైన పాత్రలో ఉంచండి.

అప్లై చేసే విధానం: ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు, మీ జుట్టును బాగా కడగాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇది 2-3 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. తర్వాత చల్లటి నీటితో జుట్టును బాగా కడగాలి. మీ జుట్టు చాలా జిగటగా మారినట్లయితే, మీరు వారానికి 2-3 సార్లు కూడా దీనిని అప్లై చేసుకోవచ్చు.

శనగపిండి హెయిర్ మాస్క్:
శనగపిండి మన జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టులోని అదనపు నూనెను గ్రహించి, శిరోజాలను శుభ్రపరుస్తుంది. శనగపిండి జుట్టును మృదువుగా , తేలికగా మార్చడంలో కూడా సహాయపడుతుంది.
ఎలా తయారు చేయాలి: దీని కోసం, 4 చెంచాల శనగపిండికి కొంచెం నీరు కలిపి మందపాటి పేస్ట్ సిద్ధం చేయండి. దీన్ని బాగా కలపండి. తద్వారా ఇది జుట్టుకు బాగా అప్లై చేయండి.
అప్లై చేసే విధానం: ఈ పేస్ట్‌ను జుట్టు మూలాలపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి.

Also Read: ఇంట్లోనే.. ఇలా గోల్డెన్ ఫేషియల్

గ్రీన్ టీ:
గ్రీన్ టీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఆయిల్ స్కాల్ప్‌ను నియంత్రిస్తాయి. ఇది జుట్టును బలంగా , తాజాగా ఉంచుతుంది.
తయారు చేయాలి: దీన్ని చేయడానికి, 2 గ్రీన్ టీ బ్యాగ్‌లను వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత బయటకు తీయండి.
అప్లై చేసే విధానం: షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ గ్రీన్ టీ వాటర్‌తో జుట్టును బాగా కడగాలి. దీన్ని తలకు పట్టించి మృదువుగా మసాజ్ చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం, గోరువెచ్చని నీటితో జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు రాలకుండా ఉంటుంది.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×