BigTV English

Akhanda 2 Update: మహాకుంభమేళలో షూటింగ్.. దద్దరిల్లిపోయే అప్డేట్ ఇచ్చిన బోయపాటి

Akhanda 2 Update: మహాకుంభమేళలో షూటింగ్.. దద్దరిల్లిపోయే అప్డేట్ ఇచ్చిన బోయపాటి

Akhanda 2 Update: టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా వస్తుందంటే చాలు.. అది కచ్చితంగా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతుంటారు. అలాంటి కాంబినేషన్స్‌లో ఒకటి బోయపాట శ్రీను (Boyapati Srinu), బాలకృష్ణ (Balakrishna). సీనియర్ హీరో బాలయ్య గత కొన్నేళ్లుగా తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో చాలా మార్పులు చేసుకున్నారు. వయసుకు తగిన పాత్రలు చేస్తూ.. తన నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అదే ఫాలో అవుతూ ముందుకెళ్తున్నారు. అప్పుడప్పుడు బాలయ్యకు పరాజయాలు ఎదురయినప్పుడు ఆయనకు మరొక బ్లాక్‌బస్టర్ అందించడానికి బోయపాటి ముందుకొస్తారు. ప్రస్తుతం వీరి కాంబోలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ (Akhanda 2) నుండి దద్దరిల్లిపోయే అప్డేట్ ఇచ్చాడు బోయపాటి.


దద్దలిల్లే సీక్వెల్

ఇప్పటికే బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే ఈ కాంబోపై ప్రేక్షకుల్లో అంత నమ్మకం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి సినిమా చేశారంటే అది కచ్చితంగా హిట్టే అని బలంగా నమ్ముతారు ఫ్యాన్స్. ఇక బాలయ్య కూడా అప్పుడప్పుడు ఇతర దర్శకులతో సినిమాలు చేసినా కూడా తిరిగి బోయపాటి దగ్గరికే రావాలని అనుకుంటారు. అలా ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘అఖండ 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రెండేళ్ల క్రితం విడుదలయిన ‘అఖండ’.. బ్లాక్‌బస్టర్ కాగా ఇప్పుడు సీక్వెల్‌ను అంతకు మించిన రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టాడు.


బిగ్ టీవీతో బోయపాటి

‘అఖండ’ సినిమాలో కాసేపటి వరకు బాలయ్యను ఒక అఘోరగా చూపించాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు సీక్వెల్ కోసం అఘోరలను కాదు.. ఏకంగా నాగ సాధువులను రంగంలోకి దించాడు. ఒరిజినల్ నాగ సాధువులతో షూటింగ్ చేయడం కోసం మహాకుంభమేళకు బయల్దేరింది ‘అఖండ 2’ టీమ్. కోట్ల మంది జనం మధ్య మహాకుంభమేళలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడే బిగ్ టీవీ కెమెరాల కంటికి చిక్కారు బోయపాటి శ్రీను. మహాకుంభమేళ ఏర్పాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదని, అంతా బాగానే ఉందని ప్రశంసించారు. ఆ తర్వాత ‘అఖండ 2’కు సంబంధించిన అప్డేట్‌ను బయటపెట్టారు. దీంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగింది.

Also Read: వెంకీ మామా జోరు.. పొంగల్ రికార్డు బ్రేక్.. ఎన్ని కోట్లంటే..?

ఇక్కడే ఉంటున్నాం

‘‘జనవరి 11 నుండి మహాకుంభమేళలోనే షూటింగ్ జరుపుకుంటున్నాం. అఘోరాలకు సంబంధించిన సినిమా కాబట్టి ఇక్కడే షూటింగ్ చేసుకొని వెళ్లాలని అనుకున్నాం. ఇక్కడ అఖండత పాటు నాగసాధువులు అందరినీ కలుస్తాం. అఖండ 2 సినిమా ఏంటి అనేదాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు’’ అని అన్నారు బోయపాటి. కానీ మహాకుంభమేళలో షూటింగ్ చేయడానికి వచ్చారు కాబట్టి కచ్చితంగా ‘అఖండ 2’లో ఒరిజినల్ అఘోరాలు, నాగ సాధువులు ఉంటారనే విషయం ప్రేక్షకుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఇలా ‘అఖండ 2’ గురించి బిగ్ టీవీకి ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ అందించి బాలయ్య ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు బోయపాటి. మామూలుగా సీక్వెల్స్‌ను ఆడియన్స్ అంతగా నమ్మకపోయినా ‘అఖండ 2’ మాత్రం వారి అంచనాలను అందుకుంటుందని నమ్ముతున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×