Gambhir – Sarfaraz: న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు టెస్ట్ సిరీస్ ని కోల్పోయిన అనంతరం బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడిన విషయం తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్ బోర్న్ టెస్టులో టీమిండియా ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్ సంభాషణలు బయటికి రావడంతో పెద్ద దుమారం రేగింది. మెల్ బోర్న్ టెస్టులో భారత జట్టు ఓటమి తర్వాత ప్లేయర్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: IPL 2025: RCB కప్పు కొట్టాలని తెలుగోడి శబరిమల యాత్ర…?
జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడకపోతే ఇకనుండి తీవ్ర పరిణామాలు ఉంటాయని గౌతమ్ గంభీర్ హెచ్చరించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. టీమ్ ఇండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేడెక్కిందని, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపించాయి. ఈ డ్రెస్సింగ్ రూమ్ రగడపై ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూమ్ లో జరిగిన సంభాషణలు అక్కడికే పరిమితం కావాలని ట్వీట్ చేశారు. అనంతరం గౌతమ్ గంభీర్ కూడా ఇదే విషయంపై ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు.
డ్రెస్సింగ్ రూమ్ లో ఎటువంటి గొడవలు జరగలేదని, అవన్నీ రూమర్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లకు – కోచ్ కి మధ్య చాలా సంభాషణలు జరుగుతాయని.. అవి అక్కడికే పరిమితం కావాలన్నది తన అభిప్రాయమని అన్నారు. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని.. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. బయట వినిపిస్తున్న వార్తలపై స్పందించాల్సిన అవసరం కూడా లేదన్నారు. అయితే నిజాయితీ కలిగిన వ్యక్తులు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నంతవరకు భారత క్రికెట్ సురక్షితంగానే ఉంటుందన్నారు.
ఈ డ్రెస్సింగ్ రూమ్ ఘటన జరిగి దాదాపు 20 రోజుల పైనే అవుతుంది. ఈ వివాదం సర్దుమనిగింది అనుకుంటున్న సమయంలో మరోసారి తెరపైకి వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ సంభాషణని భారత యువ ఆటగాడు సర్పరాజు లీక్ చేసి ఉంటాడని కోచ్ గౌతమ్ గంభీర్ అనుమానిస్తున్నట్టుగా ఇప్పుడు ప్రచారం మొదలైంది. ఒకవేళ సర్పరాజ్ నిజంగానే డ్రెస్సింగ్ రూమ్ లోని సంభాషణలను లీప్ చేసినట్లు నిర్ధారణ జరిగితే అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. అసలే జుట్టులోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు సర్పరాజ్ ఖాన్.
దేశవాళి టోర్నీల్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నప్పటికీ అతడిని సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు చేసినా.. జాతీయ జట్టుకు ఆడేందుకు అతడికి చాలా సమయం పట్టింది. అయినప్పటికీ లేటుగా ఎంట్రీ ఇచ్చినా.. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో జట్టు కష్ట సమయాలలో ఉన్నప్పుడు 150 పరుగులతో రాణించాడు.
అంతేకాదు తన టెస్ట్ కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. దీంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని అనుకునేలోపే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడిని పూర్తిగా బెంచ్ కే పరిమితం చేశారు. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ రూమ్ సంభాషణ లీక్ విషయంతో అతడి కెరీర్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
డ్రెస్సింగ్ రూమ్ సంభాషణని మీడియాకు లీక్ చేసింది సర్పరాజ్ అని కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐకి చెప్పినట్లుగా సమాచారం. దీంతో సర్పరాజ్ విషయంలో గంభీర్ అసంతృప్తిగా ఉన్నారని.. గంభీర్ జట్టుకు కోచ్గా ఉన్నంతవరకు అతడు భారత జట్టులో ఆడే అవకాశం లేదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అతడే లీక్ చేసినట్లుగా గంభీర్ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా..? అనేది మాత్రం ఈ నివేదికలు ధ్రువీకరించలేదు.