Hair Growth Tips: జుట్టు మందంగా , పొడవుగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. జుట్టు మన అందాన్ని మరింత పెంచుతుంది. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యంతో పాటు అనారోగ్యంతో పాటు రసాయనాలతో తయారు చేసిన షాంపూలతో పాటు ఆయిల్స్ వాడటం వల్ల జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. జుట్టు ఎక్కవగా రాలినా కూడా మనలో ఆందోళన మొదలవుతుంది.
మరి ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు దృడంగా మారుతుంది. అంతే కాకుండా రాలకుండా కూడా ఉంటుంది. మరి ఎలాంటి టిప్స్ జుట్టును మందంగా మార్చడంతో పాటు జుట్టు సంబంధిత సమస్యలను తొలగిస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్: మీ రోజు వారి ఆహారంలో బాదంతో పాటు వాట్ నట్స్, గుమ్మడి గింజలు, చియా విత్తనాలతో పాటు మరిన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చుకోండి. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క లక్షణాలు వాటిలో కనిపిస్తాయి. దీని కారణంగా మీ జుట్టుకు తగిన పోషణ లభిస్తుంది.
షాంపూల వాడకం:
అధిక రసాయన పదార్థాలు ఉన్న షాంపూలు మీ జుట్టును చాలా పొడిగా చేస్తాయి. అంతే కాకుండా వీటిలోని పోషకాలు కనిపించే సెబమ్ మొత్తాన్ని తగ్గిస్తాయి. దీని కారణంగా మీ జుట్టు త్వరగా విరగడం ప్రారంభమవుతుంది . ఫలితంగా జుట్టు చివర్లు చిట్లడం ఏర్పడుతుంది.
గుడ్లు తినండి:
గుడ్లు జుట్టుకు అవసరమైన ప్రొటీన్లను అందిస్తాయి. గుడ్లలో జింక్ , సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి. అందుకే ప్రతి రోజు గుడ్లు తినడం అలవాటు చేసుకోండి. తరుచుగా గుడ్లు తినడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా రాలకుండా ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడంలో గుడ్డులో ఉన్న పోషకాలు బాగా పనిచేస్తాయి.
మీ జుట్టుకు మసాజ్ చేయండి:
జుట్టుకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా కొబ్బరి నూనెలో ఆముదం మిక్స్ చేసి, కొద్దిగా వేడెక్కించి మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
తృణధాన్యాలు తినండి:
జుట్టు మందంగా , బలంగా ఉండాలంటే, బయోటిన్, జింక్, ఐరన్ , విటమిన్ బి యొక్క లక్షణాలను కలిగి ఉన్న తృణధాన్యాలు తినండి. తరుచుగా స్ప్రౌట్స్ తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.అందులోని పోషకాలు జుట్టు రాలకుండా చేస్తాయి. అంతే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.
Also Read: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. వీటిని మించినది లేదు
హెయిర్ మాస్క్ వేయండి:
అరటి, బొప్పాయి హెయిర్ మాస్క్ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అరటిపండుతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టుకు అప్లై చేయడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి, అందులోని పోషకాలు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. తరుచుగా అరటి, బొప్పాయితో తయారు చేసిన హెయిర్ మాస్క్ ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఇవి జుట్టు సంబంధిత సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి.