Kangana Ranaut: సినిమాల్లో నటించడం మామూలు విషయం కాదని అంటుంటారు. అంతకంటే ఎక్కువ కష్టమైన విషయం ఒక సినిమాను నిర్మించడం, డైరెక్ట్ చేయడం అని చాలామంది ఇండస్ట్రీ నిపుణులు చెప్తుంటారు. అందుకే దర్శకులు, నిర్మాతలు ఎన్నో రిస్కులు తీసుకొని సినిమాలు చేస్తుంటారు. అలాగే బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తన మూవీ ‘ఎమర్జెన్సీ’ గురించి దాదాపు తన ఆస్తులను, సమయాన్ని అంతా కోల్పోయింది. ఆ విషయాన్ని ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన తర్వాత బయటపెట్టింది కంగనా. ఒకప్పుడు తన ఇల్లు అమ్మేయాలని నిర్ణయించుకోవడానికి కారణమేంటి అని కూడా చెప్పుకొచ్చింది.
ఎన్ని కష్టాలో.!
కంగనా రనౌత్ హీరోయిన్‌గానే కాదు.. దర్శకురాలిగా కూడా నిరూపించుకుంది. అలాంటి కంగనా రెండోసారి ‘ఎమర్జెన్సీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా 2022లో మొదలు కావాల్సింది. అప్పుడే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. అయినా కూడా షూటింగ్ విషయంలో సినిమా చాలా లేట్ అయ్యింది. షూటింగ్ పూర్తయిన తర్వాత సెన్సార్ అవ్వడం కోసం మేకర్స్ చాలా కష్టపడ్డారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) వల్ల కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అలా ‘ఎమర్జెన్సీ’ వల్ల తను ఎన్ని కష్టాలో పడిందో తాజాగా పూర్తిగా వివరించింది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఏడ్చే మనిషి లేరు
‘‘ఎమర్జెన్సీ చేస్తున్న సమయంలో నేను ఆర్థికంగా చాలా కష్టపడ్డాను. చాలామంది వెనక్కి తగ్గారు. ఎవరూ ఈ సినిమాను కొనలేదు. ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా కొనడానికి సిద్ధంగా లేదు. ఈ సినిమాను చేయడం కోసం నా ఇల్లు కూడా అమ్మకానికి పెట్టాను. నేను ఇలాంటివి అన్నీ ఎదుర్కున్నా కూడా ఎవరి దగ్గరకు వెళ్లి ఏడలేకపోయాను’’ అంటూ బాధతో వాపోయింది కంగనా రనౌత్. ‘ఎమర్జెన్సీ’ (Emergency) విషయంలో తను పడిన కష్టాల గురించి ఇప్పటికీ ఎన్నోసార్లు బయటపెట్టింది. ఇటీవల ఆ మూవీ విడుదలయ్యి చాలావరకు పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది. ఈ సినిమాతో కంగనాకు మరో నేషనల్ అవార్డ్ రావడం పక్కా అని కూడా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Also Read: నన్ను కావాలని ఆ సినిమా నుండి తీసేశారు.. నిర్మాతలపై అక్షయ్ కుమార్ ఆరోపణలు
అబద్ధపు కేసులు
‘‘నేను ఎప్పుడూ పీఆర్ టీమ్ అనేది పెట్టుకొని నన్ను నేను ప్రమోట్ చేసుకోలేదు. కానీ కొంతమంది మాత్రం నా ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి పీఆర్‌లను నియమించారు. నేను సైకో, దెయ్యం అనుకుంటూ నాపై అబద్ధపు కేసులు కూడా పెట్టారు. నా గురించి చాలా చెడుగా మాట్లాడారు. ఎవరూ ఆడవారి గురించి అలా మాట్లాడకూడదు’’ అని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్ (Kangana Ranaut). ఇండస్ట్రీ, నెపో కిడ్స్ అంతా ఒకవైపు.. తాను మాత్రమే ఒకవైపు అని ఎప్పటినుండో ఫీల్ అవుతూ ఉంటుంది కంగనా. అందుకే ఎక్కువగా సీనియర్ హీరోలతో యాక్ట్ చేయడానికి ఇష్టపడదు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే తన సత్తా చాటుకొని బాలీవుడ్ క్వీన్‌గా నిలబడింది.