BigTV English

Fitness Tips: మార్చి 1 నుంచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. నెలరోజుల్లో ఫిట్ గా అవ్వడం ఖాయం!

Fitness Tips: మార్చి 1 నుంచి ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. నెలరోజుల్లో ఫిట్ గా అవ్వడం ఖాయం!
Tips for Body Fitness

Tips for Body Fitness: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరం ఫిట్ గా ఉండటం చాలా అవసరం. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ.. అందుకు తగిన వాటిని ఫాలో అవ్వడంలో అలసత్వం వహిస్తారు. రేపటి నుంచి చేద్దాం, ఎల్లుండి నుంచి చేద్దాం.. వచ్చే నెల నుంచీ పక్కాగా డైట్ ఫాలో అవుదాం.. ఇలా ఫిట్ నెస్ మాటెత్తితే వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. ఇలా అయితే.. ఎప్పటికీ మీరు ఫిట్ గా ఉండలేరు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే.. ఇప్పుడే ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. తినడం నుంచి వ్యాయామం వరకూ అన్నీ క్రమంగా పాటించాలి. నచ్చిన ఆహారం కనిపించగానే టెంప్ట్ అవ్వకుండా కంట్రోల్డ్ గా ఉండటం అలవాటు చేసుకోవాలి.


బరువు తగ్గి.. శరీరం ఫిట్ గా ఉండాలంటే ఒక్క నెల చాలు. ఈ నెలరోజులు ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అయితే.. ఆటోమెటిక్ గా మీరు శరీర బరువు తగ్గి.. ఫిట్ గా మారిపోతారు. ఆ తర్వాత ఫిట్ నెస్ ను మెయింటెయిన్ చేయాలన్న కోరికతో.. మీరే మీ జీవనశైలిని మార్చుకుంటారు.

ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉండదు. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగాలి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. నిమ్మరసం, మెంతి, తేనె కలిపిన గోరువెచ్చని నీరు కూడా తాగొచ్చు.


Read More: ఆడపిల్లలకు కచ్చితంగా పెట్టాల్సిన ఆహారాలు ఇవి.. ఎందుకో తెలుసుకోండి..

మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకునేందుకు జిమ్ లో గంటలు గంటలు కష్టపడనక్కర్లేదు. ఇంట్లోనే యోగా, వ్యాయామం చేయడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. రోజుకు కనీసం 1 గంట అయినా ఫిజికల్ వ్యాయామం చేయాలి. ఏరోబిక్స్, డ్యాన్స్ వంటి వాటిని ఫాలో అవ్వొచ్చు.

నెలరోజుల్లో బరువు తగ్గాలంటే.. చక్కెరతో కలిపిన, తయారు చేసిన ఆహారాలను తినకూడదు. ఇందులో కొవ్వు ఎక్కువ ఉంటుంది. చక్కెరకు బదులుగా బెల్లం వాడొచ్చు. దీనివల్ల శరీరానికి ఐరన్ అందుతుంది.

చాలామంది తమకు ఆకలి ఉన్నదానికంటే ఎక్కువగా తింటారు. అందుకు కారణం తమకు నచ్చిన ఆహారం. ఇది బరువు త్వరగా పెరగడానికి ప్రధాన కారణం. ఈ అలవాటును మానుకోవాలి. వీలైతే పండ్లను ఎక్కువగా తినండి. కడుపు నిండి.. ఆకలి త్వరగా వేయదు.

ప్రతిరోజూ వాకింగ్ తప్పనిసరి. ఒక నెలలో ఫిట్ గా తయారవ్వడం అంటే అంత తేలికైన విషయం కాదు. ప్రతిరోజూ 4 కిలోమీటర్లు నడిచేందుకు ప్రయత్నించాలి. అలాగే కచ్చితంగా 8 గంటల పాటు నిద్ర ఉండాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి.

Tags

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×