Silky Hair: జుట్టు అందంగా ,ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం వేలల్లో ఖర్చు చేసే వారు కూడా చాలా మంది ఉంటారు. కొందరు బయట మార్కెట్ లో దొరికే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటే మరి కొందరు, హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు. హోం రెమెడీస్ జుట్టును సిల్కీగా మార్చడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా కాపాడతాయి. చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే హెయిర్ ట్రీట్ మెంట్ చేసుకోవచ్చు. మరి ఇందుకు ఎలాంటి హెయిర్ మాస్కులు ఉపయోగపడతాయి. వీటిని ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు, తేనె హెయిర్ మాస్క్:
అరటిపండు జుట్టును డీప్ కండిషన్ చేస్తుంది.తేనె జుట్టుకు మెరుపును తెస్తుంది. మీరు ఈ రెండు పదార్థాలతో కూడిన హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఈ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, ముందుగా 1 పండిన అరటిపండును స్మాష్ చేయండి. అరటిపండును గుజ్జు చేసిన తర్వాత, దానికి 1 టేబుల్ స్పూన్ తేనె , 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలపండి. చివరగా జుట్టు మీద అప్లై చేసి 30-40 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.
పెరుగు, అలోవెరా హెయిర్ మాస్క్:
పెరుగు జుట్టును తేమ చేస్తుంది . కలబంద స్కాల్ప్‌ను ఆరోగ్యవంతంగా చేస్తుంది. జుట్టుకు మెరుపును తెస్తుంది. ఈ రెండింటిని ఒక మాస్క్ లాగా తయారు చేయడానికి, ముందుగా 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని, అందులో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ జోడించండి. దీన్ని బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. 30-40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
గుడ్డు, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్:
గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలంగా, మెరిసేలా చేస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు లోతైన కండిషనింగ్ ఇస్తుంది. ఈ రెండు వస్తువుల మాస్క్‌ను తయారు చేయడానికి, 1 గుడ్డును పగలగొట్టండి. దానికి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపండి. దీన్ని జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరింత సున్నితత్వం కోసం, షాంపూ తర్వాత కండీషనర్ అప్లై చేయండి.
మెంతులు , పాలతో హెయిర్ మాస్క్:
మెంతులు వెంట్రుకలను మృదువుగా, ఒత్తుగా మారుస్తాయి. జుట్టును బాగా స్కిల్కీగా ఉంచుతాయి. ఈ మాస్క్ సిద్ధం చేయడానికి, 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టండి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి, దానికి 3 టేబుల్ స్పూన్ల పాలు జోడించండి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 40 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయాలి.
Also Read: ఇలా చేస్తే.. క్షణాల్లోనే ఫేషియల్ హెయిర్ మాయం
రైస్ వాటర్ , అలోవెరా హెయిర్ మాస్క్:
రైస్ వాటర్ జుట్టుకు సహజమైన స్మూత్ , స్ట్రెయిట్ లుక్ ఇస్తుంది . కలబంద జుట్టును హైడ్రేట్ చేస్తుంది. ఈ మాస్క్‌ను సిద్ధం చేయడానికి, 1 కప్పు బియ్యాన్ని నీటిలో 30 నిమిషాలు నానబెట్టి, నీటిని తీసివేయండి. అందులో 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి 20-30 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి.