BigTV English

Facial Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే ఫేషియల్ హెయిర్ మాయం

Facial Hair: ఇలా  చేస్తే.. క్షణాల్లోనే ఫేషియల్ హెయిర్ మాయం

Facial Hair: ప్రతి అమ్మాయి మచ్చలేని, అందమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటుంది. దీని కోసం రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తారు. కానీ ఈ కోరిక అందాన్ని తగ్గించే అవాంఛిత రోమాలతో చెడిపోతుంది. శరీరంలో హార్మోన్లు అధికంగా ఉండటం వల్ల ముఖంపై హెయిర్ పెరగడం సహజమైన ప్రక్రియ. ఈ అవాంఛిత రోమాలను వదిలించుకోవాలంటే, పార్లర్‌లో బడ్జెట్‌కు మించి ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ పార్లర్‌కు వెళ్లకుండానే ఇంట్లో కూర్చొని కొన్ని సులభమైన పద్ధతుల సహాయంతో ముఖంపై అవాంఛిత రోమాలను వదిలించుకోవచ్చు. మరి ఎలాంటి హోం రెమెడీస్ అన్ వాంటెడ్ హెయిర్‌ను తొలగించడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


హోం రెమెడీస్ :

1. పసుపు ,చందనం ప్యాక్
పసుపు ఒక సహజ నివారణ అని మనందరికీ తెలుసు. ఇది చిన్న చిన్న వెంట్రుకలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు, ఇది చర్మ కాంతిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. పసుపులో యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.


కావలసినవి:
పసుపు పొడి- 1 టీస్పూన్
చందనం పొడి- 1 టీస్పూన్
పాలు- 1 చెంచా

తయారు చేసే విధానం:
1. ముందుగా ఒక గిన్నెలో పసుపు, గంధపు పొడి వేయాలి.
2. దానికి కొంచెం పాలు వేసి పేస్ట్ లా చేసుకోవాలి.
3. ఈ పేస్ట్‌ని ముఖంపై అన్ వాంటెడ్ హెయిర్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేయండి.
4. 20-30 నిమిషాలు ఉండనివ్వండి.
5. ప్యాక్ ఆరిపోయినప్పుడు, దానిని సున్నితంగా మసాజ్ చేస్తూ తొలగించండి. దీని రెగ్యులర్ వాడకంతో ముఖంపై వెంట్రుకలను వదిలించుకోవచ్చు.

2. శనగ పిండి, రోజ్ వాటర్:
శనగ పిండి సహజమైన స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇది అవాంఛిత ముఖ రోమాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో పాటు, రోజ్ వాటర్ చర్మాన్ని తేమగా , మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
కావలసినవి:
శనగపిండి- 2 స్పూన్లు
రోజ్ వాటర్- 1 టీస్పూన్
తయారు చేసే విధానం:
1. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇందుకోసం ముందుగా రోజ్ వాటర్‌తో శనగపిండిని కలిపి పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి.
2. ఈ పేస్ట్‌ని మీ ముఖంపై అప్లై చేయండి.
3. 15-20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, సున్నితంగా స్క్రబ్ చేసి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇది వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.

3. చక్కెర, నిమ్మరసంతో ప్యాక్:
చక్కెర, నిమ్మరసం మిశ్రమం కూడా ఒక గొప్ప హోం రెమెడీ. ఇది అవాంఛిత ముఖ రోమాలను తొలగించడంలో సహాయపడుతుంది. నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు అన్ వాంటెడ్ హెయిన్ తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా చక్కెర చర్మం ఉపరితలంపై రుద్దడం ద్వారా హెయిర్ తొలగించడంలో సహాయపడుతుంది.

Also Read: గులాబీ రేకులతో ఫేస్ ప్యాక్.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

కావలసిన పదార్థాలు:

చక్కెర- 1 టీస్పూన్
నిమ్మరసం- 1 టీస్పూన్
తయారు చేసే విధానం:
1. దీన్ని చేయడానికి, ముందుగా చక్కెర , నిమ్మరసం కలపాలి.
2.తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయండి.
3. 10-15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×