BigTV English

Kids Mental Health: మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే జాగ్రత్త సుమీ!

Kids Mental Health: మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా..? అయితే జాగ్రత్త సుమీ!

Signs of Mental Health Problem in Children: తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎల్లప్పుడు గమనిస్తూ ఉండాలి. అంతే కాకుండా వారి ఫీలింగ్స్ అర్ధం చేసుకోవాలి. వారి మానసిక ఆరోగ్యం ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. పిల్లలు పెద్దలకు చాలా వరకు తమ సమస్యలు చెప్పలేరు. దీంతో తమలో తామే నలిగిపోతూ ఉంటారు. కొన్ని సార్లు వారు కమ్యూనికేట్ చేసే విధానం కూడా భిన్నంగా ఉంటుంది.


వారి బాధలను చెప్పడానికి వాడాల్సిన పదాలు కూడా వారికి తెలియకపోవచ్చు. దీని వల్ల వారి మానసిక ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో తరచూ చిరాకు పడటం, చెప్పిన పనులు సరిగా చేయకపోవడం, ఏకాగ్రత సమస్యలు, తలనొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. పిల్లల ఆరోగ్యం విషయంలో పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల మనసుతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పిల్లల మానసిక, ఆరోగ్య సమస్యల లక్షణాలను అల్లరి అనే పేరుతో తోసి పుచ్చడం సరికాదు. పిల్లలతో మాట్లాడానికి సమయం కేటాయించాలి. ఏ సమయంలోనైనా వారి భావోద్వేగాలను వారికి వ్యక్తీకరించే స్వేచ్ఛ ఇవ్వాలి. వారి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. అయితే పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యల సంకేతాలు స్పష్టంగా ఒక్కోసారి కనిపిస్తాయి. తల్లిదండ్రులు వాటిని అర్థం చేసుకుని పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు కనిపించే లక్షణాలపై అవగాహన పెంచుకోవాలి.


Also Read: Drinking Water On an Empty Stomach: పరిగడుపున నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా.. ఇలా ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలంటే?

ప్రవర్తనలో మార్పులు: పిల్లలు నలుగురితో కలవకపోవడం వారిలో చిరాకు పెరగడం వంటివి పిల్లల ప్రవర్తనలో ఆకస్మికంగా కనిపించే మార్పులు. ఇలా ఉంటే వారిని మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. ఇలాంటి మార్పులు వారి భావోద్వేగ, మానసిక ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి. వారి అనుభవాలను అర్థం చేసుకోవడానికి పిల్లలతో స్నేహితుల్లాగా మాట్లాడటం అవసరం.

ఏకాగ్రతలో ఇబ్బంది: దేనిపై పిల్లలు ఏకాగ్రత చూపించకపోవడం, ఇంతకు ముందు బాగా పని చేసి ఇప్పుడు చేయడం లేదంటే వారి మనసులో ఏదో ఉందని అర్థం చేసుకోవాలి. ఏకాగ్రత లోపించడం అనేది మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి అనారోగ్య సమస్యలకు సంకేతం. అందుకే పిల్లలకు సహకరించి వారి ఒత్తిడిని దూరం చేయాలి.

Also Read: ఎక్కువ పాలు తాగడం హానికరమా? అసలు పాలు ఎంత తాగాలో తెలుసా..

శారీరక లక్షణాలు: కడుపు నొప్పి, తలనొప్పి అలసట వంటి శారీరక లక్షణాలు కనిపిస్తే వారితో వెంటనే మాట్లాడండి. వారిలో ఉండే అంతర్లీన మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా ఇవి సంకేతాలుగా భావించండి. ఈ సందర్భంలో వారి అనుభవాలు భావోద్వేగాలను తెలుసుకోండి.

చదువులో మార్పులు: చదవడానికి ఇష్టపడకపోవడం, ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు పిల్లల్లో ఉన్నాయా అని గమనించాలి. ఈ మార్పులు మీ పిల్లల్లో కనిపిస్తే వారి ఉపాధ్యాయులతో మాట్లాడాలి. వారి చదువుకు సంబంధించిన విషయాలను అర్థం అయ్యేలా చెప్పమని కోరాలి.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Tags

Related News

Weight Gain Fast: ఈ ఫుడ్ తింటే.. తక్కువ సమయంలోనే ఎక్కువ బరువు పెరగొచ్చు !

Spirulina Powder for Hair: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Big Stories

×