BigTV English

Sun Tan Removing Face Pack: సన్ టాన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే

Sun Tan Removing Face Pack: సన్ టాన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఫేస్ ప్యాక్స్ మీ కోసమే

 


Sun Tan Removing Face Pack: ఎండాకాలంలో ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లకు వెళుతూ చాలా మంది ముఖం నల్లగా మారిపోతుంది. ఎండల వల్ల వచ్చే చెమట కారణంగా ముఖం జిడ్డుగా మారిపోతుంది. కాలుష్యం, దుమ్ము, ధూళి వంటి కణాలు చర్మానికి అంటుకుని చర్మం డ్యామేజ్ అవుతుంది. దీని వల్ల చాల మంది ఆఫీసులకు జిడ్డు ముఖాలతో వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ తరుణంలో మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్ లను వాడుతుంటారు. వీటి వల్ల చర్మం అప్పటి వరకు నిగనిగలాడిన తిరిగి కొన్ని రోజులకు మళ్లీ అదే స్థితికి చేరుతుంది. అందువల్ల చర్మానికి మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్ ప్యాక్ లు కాకుండా వంటింట్లో లభించే ఫేస్ ప్యాక్ లను వాడడం ద్వారా చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. మరి అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.

ముల్తానీ మట్టి..


పూర్వ కాలం నుంచి ముల్తానీ మట్టికి మంచి సౌందర్యం గల చర్మాన్ని అందించే గుణాలు ఉన్నాయని నిపుణులు అంటుంటారు. అయితే చర్మానికి ముల్తానీ మట్టిని వాడడం వల్ల జిడ్డును తొలగించుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా చర్మం సాఫ్ట్ గా మారుతుంది. అంతేకాకుండా ఎండాకాలంలో చర్మంపై ఏర్పడే మొటిమలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు చర్మంపై ఉండే మచ్చలను కూడా తొలగిస్తుంది.

టమాట, క్యారెట్..

వంటింట్లో లభించే కూరగాయలతో కూడా చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా టమాట, క్యారెట్ వంటి వాటితో చర్మం మెరుస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యంగ్ గా మార్చుతుంది. ముఖ్యంగా వీటిలోని విటమిన్లు, పాలీఫెనాల్స్, ఖనిజాలు వంటివి పుష్కలంగా ఉండడం వల్ల చర్మానికి కొత్త రకమైన జీవం పోస్తాయి. అంతేకాకుండా వీటిలోని విటమిన్ సీ చర్మానికి ఆక్సీకరణ అందిస్తుంది. అయితే ముల్తానీ మట్టి, టమాట, క్యారెట్‌లతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వేసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.

ఫేస్ ప్యాక్ తయారీ..

క్యారెట్‌ను కాస్త తురిమి రసాన్ని పిండుకోవాలి. అలాగే టమాటను కూడా మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకుని రసాన్ని తీసుకోవాలి. ఈ రెండింటితో కాస్త ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుని అనంతరం చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

Tags

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×