BigTV English
Advertisement

Tomato Halwa: ఏదైనా కొత్తగా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తుందా? టమోటా హల్వా ప్రయత్నించండి

Tomato Halwa: ఏదైనా కొత్తగా స్వీట్ రెసిపీ తినాలనిపిస్తుందా? టమోటా హల్వా ప్రయత్నించండి

Tomato Halwa: దీపావళికి ఏం స్వీట్ చేయాలని ఆలోచించేవారు తక్కువ ఖర్చుతోనే టమోటో హల్వా చేయడానికి ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రుచిలో కూడా అదిరిపోతుంది. పండిన టమోటోలతో చేసే ఈ హల్వా మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. ముఖ్యంగా దీపావళి సమయంలో ఇంట్లో ఏదో ఒక స్వీట్ను తయారు చేయడం తెలుగు వారికి అలవాటే. కాబట్టి టమోటా హల్వాను చేసి జీడిపప్పులు, బాదం, పిస్తాలతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. దీనని వండడం కూడా చాలా సులువు.


టమోటో హల్వాకు కావలసిన పదార్థాలు
టమాటాలు – అయిదు
పంచదార – పావు కప్పు
ఫుడ్ కలరు – చిటికెడు
బొంబాయి రవ్వ – పావు కప్పు
నెయ్యి – పావు కప్పు
డ్రై ఫ్రూట్స్ – గుప్పెడు
యాలకుల పొడి – అర స్పూను

టమోటా హల్వా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
2. ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, ఉప్మా రవ్వ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అందులో ఒక కప్పు నీళ్లు వేయాలి.
4. ఆ కప్పు నీళ్లు బాగా మరిగాక వేయించిన బొంబాయి రవ్వను అందులో వేసి గరిటతో కలుపుతూ ఉండాలి.
5. ఈ రవ్వ చిక్కబడుతున్నప్పుడు టమోటోలను ప్యూరీలా మార్చి, ఆ ఫ్యూరీని అందులో వేయాలి. గరిటతో బాగా కలపాలి.
6. మీకు ఏ రంగులో ఈ స్వీట్ కావాలనుకుంటున్నారో ఆ రంగు ఫుడ్ కలర్ ను కలపవచ్చు.
7. మీకు ఫుడ్ కలర్ వాడడం ఇష్టం లేకపోతే ఏ రంగు ఫుడ్ కలర్ కలపాల్సిన అవసరం లేదు.
8. అలాగే పంచదారను కూడా ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి.
9. నెయ్యిని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి.
10. అది బాగా ఉడికి హల్వా లాగా దగ్గర పడుతుంది.
11. ఆ సమయంలోనే యాలకుల పొడిని చల్లుకోవాలి.
12. అలాగే డ్రై ఫ్రూట్స్ ను కూడా పైన చల్లుకొని బాగా కలుపుకోవాలి.
13. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసి హల్వాను ఆ ప్లేట్లో పరిచి ముక్కలుగా కోసుకోవాలి. అంతే టేస్టీ టమోటో హల్వా రెడీ అయినట్.టే ఇది చాలా రుచిగా ఉంటుంది.
14. టమోటోలు ఆరోగ్యానికి కూడా మంచిదే. కాబట్టి అప్పుడప్పుడు ఈ హల్వాను తినవచ్చు.
15. మీరు హల్వాలా తినాలనుకుంటే ముక్కలుగా కోయక్కర్లేదు. లేదా బర్ఫీలా తినాలనుకుంటే ముక్కలుగా కోసుకోవచ్చు.


Also Read: పల్లీలు లేదా కొమ్ము శనగలు, ఈ రెండింటిలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది

టమాటోలు ఉపయోగాలు
టమాటోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమోటాలను ప్రతిరోజూ తినేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని చెబుతారు. మన ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, దంతాలు బలంగా ఉండాలన్నా టమోటోలను ప్రత్యేకంగా తినమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. టమోటాలో ఉండే లైకోపీన్ మన శరీరంలో ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎముక ఆరోగ్యం పై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. టమోటాల్లో ఉండే కెరటనాయిడ్లు మన ఎముకలను బలోపేతం చేసి బరువులు మోసే సామర్ధ్యాన్ని ఇస్తాయి. అలాగే టమోటాల్లో ఉండే లైకోపీన్ గుండెకు కూడా రక్షణగా నిలుస్తుంది. గుండె కోసమైనా ప్రతిరోజూ టమాటోలతో వండిన ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. టమోటాలు ప్రతిరోజూ తినే వారిలో మతిమరుపు, డిప్రెషన్ సమస్యలు తక్కువగా వస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా టమోటోలు ముందుంటాయి. టమోటాలను తరచూ తినే వారిలో క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి మీ ఆరోగ్యం కోసం టమాటాలను ఆహారంలో భాగం చేసుకోండి.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×