Big Stories

Face Pack for Glow Skin: మెరిసే ముఖం కోసం ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి!

Face Pack Tips for Glowing Skin: ప్రస్తుతం బిజీ లైఫ్‌లో తమ గురించి తాము ఆలోచించుకునేందుకు సమయం లేకుండా పోతోంది. దీంతో చాలా మంది చర్మ, శరీర సమస్యలతో బాధ పడుతున్నారు. మనలో చాలా మంది వివిధ పనుల కోసం బయటకు వెళ్లడం వల్ల ముఖం అనేక సందర్భాల్లో డల్ గా మారుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంతో పాటు, యవ్వనంగా ఉంటుంది.

- Advertisement -

నేటి కాలంలో ఉన్న ఒత్తిడి కారణంగా చర్మంపై శ్రద్ద తీసుకునేందుకు సమయం దొరకడం లేదు. అందుకే వారాంతాల్లోనైనా చర్మ సౌందర్యం కోసం పలు జాగ్రత్తులు తీసుకోవాలి. తరుచుగా కొన్ని రకాల ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల స్కిన్ టోన్ మెయిన్‌టెయిన్ అవుతుంది. క్రింద ఉన్న ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు.

- Advertisement -

తేనె, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:

ఒక టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు పోవడంతో పాటు..చర్మం కాంతివంతంగా మారుతుంది.

Also Read: Health Tips: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..సమ్మర్ లో పాటించాల్సిన చిట్కాలు !

పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్:
రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్యాక్ తయారు చేయండి. దీనిని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత దీనిని గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు వేసుకోవడం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోయి మెరుస్తూ ఉంటుంది.

బొప్పాయి , తేనే ఫేస్ ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్ కోసం పూర్తిగా పండిన బొప్పాయిని తీసుకోవాలి. దానిని మెత్తగా చేసుకొని అందులో ఒక టీ స్పూన్ తేనె కలిపి మిశ్రమాన్ని తయారు చేయాలి. దీన్ని ముఖం, మెడ భాగాల్లో అప్లై చేసి 15-20 నిమిషాలు పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. అంతే కాకుండా చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.

Also Read: వేసవిలో గ్రీన్‌ టీ తాగితే ఏం అవుతుంది..?

కలబంద, దోసకాయ ఫేస్ ప్యాక్:

అలోవెరా జెల్ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో ఒక దోస కాయను తీసుకొని దీన్ని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వత దీన్ని ఫేస్ కు అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ ద్వారా చర్మం పొడిబారకుండా ఉండి , కాంతి వంతంగా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News