BigTV English

Health Tips: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..సమ్మర్ లో పాటించాల్సిన చిట్కాలు !

Health Tips: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..సమ్మర్ లో పాటించాల్సిన  చిట్కాలు !

Summer Health Tips: రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి నుంచి ప్రారంభమైన ఎండలు జూన్ రెండవ వారం వరకు కొనసాగుతాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యంపై కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ఎండలు, వేడి గాలులు పెరుగుతుండటంతో డీ హైడ్రేషన్, సన్‌స్ట్రోక్ విపరీతమైన తలనొప్పి బారిన పడే అవకాశం ఉంది. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్లు పలు సూచనలు కూడా చేస్తున్నారు. అలాంటి సూచనలే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవిలో పాటించాల్సిన చిట్కాలు:


  • ఎండలోకి వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలి.
  • ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగును ఉపయోగించండి.
  • బ్లాక్, నీలం రంగు దుస్తులు సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహిస్తాయి. అందుకే నాలుపు, నీలం రంగు బట్టలు ధరించకుండా ఉండాలి.
  • కాటన్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి.
  • వృద్ధులు, పిల్లలు నీరు ఎక్కువగా త్రాగాలి.
  • సమ్మర్ లో చాలా మంది నిమ్మరసం తాగడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి సమయంలో పంచదారకు బదులు బెల్లం వాడండి.
  • తులసి ఆకులను పేస్ట్‌లా చేసి రెండు గ్లాసుల నీళ్లలో వేసుకొని ఉదయం నిద్రలేచిన వెంటనే తాగితే అలసట ఉండదని నిపుణులు చెబుతున్నారు.
  • ఆహారంలో మసాలాల వాడకం తగ్గించాలి. మసాలాల వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • ఎండా కాలంలో ముఖ్యంగా తల చల్లగా ఉండాలి. కాబట్టి రోజుకు ఒకసారి తలకు పటిక నూనె రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది.
  • పడుకునే ముందు చల్లటి నీటితో నేలను శుభ్రం చేసి పలుచని గుడ్డపై పడుకోవడం మంచిది. మంచం మీద పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

Also Read: వేసవిలో గుండెకు రిస్క్..హీట్ వేవ్ కారణంగా పెరుగుతున్న మరణాలు

  • నట్స్ అరగంట సేపు నీటిలో నానబెట్టి వాటిని మిక్సీలో వేసి జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు రెండు సార్లు తాగితే శరీరం చల్లగా ఉంటుంది.
  • సమ్మర్ లో పెరుగుకు బదులు మజ్జిగను వాడటం మంచిది. ఎందుకంటే జీర్ణక్రియకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలసట రాకుండా చేయడంతో పాటు అసిడిటీ రాకుండా చేస్తుంది.
  • చిన్న పిల్లలు డీహైడ్రేషన్ బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఐదేళ్లలోపు పిల్లలకు అయొడైజ్డ్ ఉప్పు కలిపిన నీటిని తాగించాలి.
  • వేసవిలో చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. ప్రతి రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు బకెట్ చల్లని నీటిలో పూదీనా ఆకులు వేసి స్నానం చేస్తే చెమట వాసన తగ్గడంతో పాటు చర్మంపై చెమట పొక్కులు రాకుండా ఉంటాయి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×