BigTV English
Advertisement

Quit Smoking: స్మోకింగ్.. మానేయాలా? ఈ సింపుల్ ఫార్ములాను ప్రయత్నించండి, త్వరగా మానేస్తారు

Quit Smoking: స్మోకింగ్.. మానేయాలా? ఈ సింపుల్ ఫార్ములాను ప్రయత్నించండి, త్వరగా మానేస్తారు

ప్రపంచంలో వస్తున్న సగం రోగాలకు ధూమపానం, మద్యపానం వంటివే కారణం. ధూమపానం మానేయాలని ఎంతగా చెబుతున్నా కూడా దాన్ని తాగుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ధూమపానం ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది. ప్రపంచంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడం వెనుక ధూమపానమే ముఖ్య కారణం. అయితే ధూమపానం మానేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నప్పటికీ మానలేకపోతున్నారు.


ధూమపానం వల్ల నష్టాలు
మీరు ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్నప్పుడు అలా మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ముందు తెలుసుకోండి. అలాగే ధూమపానం మీ శరీరంపై ఎలాంటి తీవ్ర ప్రభావాలను చూపిస్తుందో కూడా తెలుసుకోండి. ఈ రెండూ మీ మనసును మార్చే అవకాశం ఉంది. ధూమపానం మానేయడం వల్ల ఆయుష్షు ఎంత పెరుగుతుందో తెలుసుకోండి. కొందరు వ్యక్తులు ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో తేలికపాటి లక్షణాలను గమనిస్తారు. కొందరు మానేయడానికి చాలా కష్టపడతారు. మానేసే క్రమంలో ఇబ్బందులు పడతారు. ఇవన్నీ కూడా ముందుగా సిద్ధమయ్యాకే స్మోకింగ్ మానేయడానికి మొదటి అడుగు వేయాలి.

పదేళ్ల ముందే మరణం
ధూమపానం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి సమస్యలు అధికంగా వస్తుంటాయి. వాటి నుంచి బయట పడాలంటే మీరు ధూమపానం మానేయడం ఒక్కటే మార్గం. ఊపిరితిత్తుల వ్యాధులు అధికంగా వచ్చేది కూడా ధూమపానం వల్లే. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ధూమపానం చేయని వారి కంటే… ధూమపానం చేసేవారు 10 సంవత్సరాల ముందుగా మరణిస్తున్నట్టు తెలుస్తోంది. 2020లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కోవిడ్ 19తో ఆస్పత్రిలో చేరిన వ్యక్తుల్లో  ధూమపానం చేయని వారి కంటే… చేసే వారిలోనే  తీవ్రమైన లక్షణాలు, మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. అమెరికాలో దాదాపు 14% మంది పెద్దలు ధూమపానం చేస్తారు. వీరికి నికోటిన్ వ్యసనంగా మారి తన బానిసగా మార్చుకుంటుంది.అందుకే వీరు ప్రతి రోజు ధూమపానం చేయకపోతే ఏ పనీ చేయలేరు.


ధూమపానం మానేయడానికి కొన్ని చిట్కాలు
ధూమపానం మానేయడానికి ముందుగా మీరు ఎందుకు మానేయాలనుకుంటున్నారో ఒక కారణాన్ని మీ మెదడులో రిజిస్టర్ చేసుకోండి. ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలను పదే పదే తలుచుకోండి.

ధూమపానం మానేయడానికి మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. వారు మీకు ప్రేరణను ఇవ్వచ్చు. మీరు సిగరెట్ మానడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఆ సమయంలో మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో బిజీగా ఉండండి. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా ఫోన్ తీసి మీ స్నేహితుడికి ఫోన్ చేయండి. గంటసేపైనా మాట్లాడండి. సిగరెట్ ఆలోచనను మర్చిపోవడానికి దూరంగా పెట్టడానికి ప్రయత్నించండి.

Also Read: చెడు కొలెస్ట్రాల్‌ను ఐస్‌లా తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !

ధూమపానం చేయడానికి కొన్ని విషయాలు ట్రిగ్గర్లుగా మారతాయి. కొందరికి మద్యం తాగినప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుంది. మరికొందరికి వాకింగ్ చేసినప్పుడు సిగరెట్ తాగాలనిపిస్తుంది. కాబట్టి అలాంటి ట్రిగ్గర్లను కొన్ని రోజులు మానుకోండి. ఇంట్లో ఏ మూలా కూడా సిగరెట్ దొరకకుండా జాగ్రత్త పడండి. సిగరెట్ తాగడం వల్ల మీ జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ధూమపానం మానలేకపోతే వైద్యుల సహాయం తీసుకోండి. వారు కౌన్సిలింగ్ ద్వారా మీకు ధూమపానం మానిపించే అవకాశం ఉంది.

Tags

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×