BigTV English

Right Time for Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏదో మీకు తెలుసా..?

Right Time for Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తినడానికి సరైన సమయం ఏదో మీకు తెలుసా..?

Right Time to Eat for Dry Fruits: ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం కొందరు జిమ్‌కి వెళ్తుంటారు. వారు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వారు పండ్లు, నట్స్ వంటి పోషక ఆహారాన్ని తీసుకోవాలి. నిజానికి, మెరుగైన ఆరోగ్యం కోసం మార్కెట్లో అనేక జ్యూస్‌లు, పౌడర్‌లు, మందులు అందుబాటులో ఉన్నాయి.


వీటిని తీసుకోవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు దాని అధిక వినియోగం కూడా హానికరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు డ్రై ఫ్రూట్స్ తినవచ్చు.డ్రై ఫ్రూట్స్‌లో వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రోజు ఒక పిడికెడు డ్రై ఫ్రూట్స్ తింటే నీరసం రాదు. అంతే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఇంకా మంచి ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. కానీ డ్రై ఫ్రూట్స్ ను సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవాలి.


Also Read: Pippali Benefits: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. పిప్పాలిని రోజూ తింటే ఇట్టే మాయం అవుతాయి

డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. డ్రై ఫ్రూట్స్ రోజంతా మీకు శక్తిని ఇస్తాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా బాదంపప్పులో విటమిన్ ఇ, ఫైబర్ తో పాటు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను నివారిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఆకలి కూడా తగ్గుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ప్రొటీన్లు, మినరల్స్, కాల్షియం శరీర కండరాలకు బలాన్ని ఇస్తాయి.

డ్రై ఫ్రూట్స్ తినడానికి ఉదయాన్నే మంచి సమయం అని నిపుణులు చెబుతుంటారు. వేడి స్వభావం కలిగిన డ్రై ఫ్రూట్స్‌ని నీటిలో నానబెట్టి, తొక్క తీసి తర్వాత తినాలి. పెద్దలు ప్రతిరోజూ 15 నుంచి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చు. కానీ, వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తినడం మంచిది. ఇవి జీర్ణక్రియ ప్రక్రియకు తోడ్పడతాయి. మలబద్దకాన్ని నివారిస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఈవెనింగ్ స్నాక్ గా కూడా నట్స్ తినవచ్చని సూచిస్తున్నారు.

Also Read: ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా.. అయితే బఠాణీలు ట్రై చేయండి

డ్రై ఫ్రూట్స్ రోజువారీ వినియోగం హానికరం కాదు. కానీ, తినడానికి సరైన సమయం తెలుసుకోవడం మంచిది. డ్రై ఫ్రూట్స్  రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి ఉదయాన్నే తినాలి. ఇలా చేయడం వల్ల గింజల్లో వేడెక్కించే గుణాలు తగ్గుతాయి. మీరు వాటిని నానబెట్టడం మర్చిపోతే, వాటిని పొడిగా వేయించి తినండి. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజూ 15 నుంచి 25 గ్రాముల డ్రై ఫ్రూట్స్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×