BigTV English

Fever : జ్వరం వస్తే బరువు తగ్గుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

Fever : జ్వరం వస్తే బరువు తగ్గుతారా ? నిపుణులు ఏం చెబుతున్నారు?

Fever Weight Loss: జ్వరం వస్తే బరువు తగ్గుతారా ? ఈ ప్రశ్న మీకు చాలా సార్లు కలిగే ఉంటుంది. కానీ.. అందుకు సరైన సమాధానం లభించి ఉండదు కదా. జ్వరం వచ్చినపుడు ఆటోమెటిక్ గా నీరసించిపోతారు. ఏమీ తినాలనిపించదు. ఫలితంగా వీక్ అవుతారు. నిజమే.. జ్వరం వస్తే బరువు తగ్గుతారంటున్నారు నిపుణులు. దీనిపై ఒక హోమియోపతి ప్రాక్టీషనర్ డాక్టర్ మంజరీరావు ఇన్ స్టాగ్రామ్ లో ఒక రీల్ ను షేర్ చేశారు. జ్వరాలు అదనపు కొవ్వును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పారామె. దీనిపై ఇంటర్నెట్ లో ఎంత సమాచారం ఉన్నా.. దానిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.


జ్వరాలు ప్రకృతిలో ఒక ఉత్ప్రేరకమని, జ్వరంతో పోరాడేటపుడు శక్తి అవసరం అవుతుందని, ఫలితంగా శరీరంలోని కేలరీలు కరిగి కొవ్వు తగ్గుతుందన్నారు. అన్ని రకాల టాక్సిన్ల నుంచి రక్షించే సామర్థ్యాన్ని శరీరం కోల్పోయినపుడు అధిక జ్వరం వస్తుందన్నారు. రోగనిరోధకశక్తి తగ్గితే.. దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయన్నారు మంజరీ.

నిజానికి హోమియోపతి చికిత్సలో అధిక జ్వరం వస్తే.. అది రోగనిరోధక శక్తి స్థాయిని మెరుగుపరుస్తుందని తెలిపారు. జ్వరం వచ్చిన వెంటనే మెడిసిన్ తీసుకోకుండా.. రెండ్రోజుల పాటు నేచురల్ గా తగ్గించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి మందులు వేసుకోవాలని, మాకు తెలుసులే అని ఏ మందు పడితే ఆ మందు వాడకూడదని సూచించారు.


Also Read: ఇలా చేస్తే.. ఈజీగా బరువు తగ్గుతారు తెలుసా ?

శరీరం జీవక్రియ పెరగడంతో అధిక ఉష్ణోగ్రతకు గురవుతుందని, ఆ సమయంలో జ్వరంతో పోరాడేందుకు కష్టపడలసి వచ్చినప్పుడు బరువు తగ్గుతారని బెంగళూరుకు చెందిన వైద్యురాలు సుచిస్మిత రాజమాన్య వెల్లడించారు. జ్వరం వచ్చినపుడు శరీరంలో కొవ్వు కరగడం అనేది తాత్కాలిక చర్యేనని ఆమె అభిప్రాయపడ్డారు. జ్వరం వచ్చినపుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హైపోథాలమస్ సెట్ పాయింట్ పెరగడం వల్ల ఇలా జరుగుతుందని రాజమాన్య పేర్కొన్నారు.

దీనిపై మరో డాక్టర్ అరవింద వాదన మరోలా ఉంది. అధిక జ్వరం శరీర బరువు తగ్గడానికి దారితీయదంటున్నారు ఇది డీ హైడ్రేషన్ కు కారణమవుతుందన్నారు. అలా జరిగినపుడు శరీరంలో నీటి శాతాన్ని కోల్పోతామని అందుకే బరువు తగ్గినట్లుగా అనిపిస్తుందన్నారు. బరువు తగ్గడం అనేది జ్వరంతో ముడిపడి ఉంటే.. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లను మినహాయించాల్సిన అవసరం ఉందన్నారు.

జ్వరం వచ్చినపుడు బరువు తగ్గడం అనేది సురక్షితమైన పద్ధతి కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికజ్వరంతో డీహైడ్రేషన్ కు గురైనప్పుడు దానిప్రభావం కండరాలప పడొచ్చని, ఫలితంగా శక్తి కోసం కండరాల కణజాలం విచ్ఛిన్నమవుతుందన్నారు. జ్వరం వచ్చినపుడు ఆహారం తీసుకోవడం తగ్గిస్తే.. పోషకాల లోపం తలెత్తుతుందని తెలిపారు. కొందరికి హై ఫీవర్ వచ్చినపుడు.. అది ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని, అది మూర్చ, మెదడులో రక్తస్రావం, పక్షవాతానికి దారి తీస్తుందన్నారు.

మొత్తానికి జ్వరం వస్తే బరువు తగ్గుతారా అన్న దానిపై వైద్యులు చెప్పిన వివరణ ఇలా ఉంది. ఒకరు కొవ్వు కరుగుతుంది అంటే.. మరొకరు మాత్రం డీహైడ్రేషన్ వల్ల అలా అనిపిస్తుందంతే అంటున్నారు. ఏదేమైనా ఫీవర్ వచ్చినపుడు కాస్తంత జాగ్రత్తగా ఉండండి.

 

 

Related News

Navratri Special Recipes: నవరాత్రి స్పెషల్ వంటకాలు.. నైవేద్యంలో తప్పకుండా ఇవి ఉండాల్సిందే !

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Big Stories

×