Skin Care In Winter: చలికాలంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.ఈ సీజన్‌లో కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా చర్మ సంబంధిత సమస్యలను కలిగుతాయి. అంతే కాకుండా చలికాలంలో చర్మంపై తేమ తగ్గినప్పుడు చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది.
కొన్నిసార్లు చర్మంపై పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఫలితంగా నొప్పిని కూడా కలిగిస్తుంది. ఇటువంటి సమయంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. చల్లని గాలి, తక్కువ తేమ కారణంగా చర్మం పొడిగా మారుతుంది. తర్వాత పగుళ్లు కూడా ఏర్పడతాయి. కొన్ని సులభమైన పద్ధతులతో చలికాలంలో కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. ఇందుకోసం ఖరీదైన ప్రొడక్ట్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
ఏ సీజన్ అయినా బయట మార్కెట్ లో దొరికే స్కిన్ కేేర్ ప్రొడక్ట్స్ కాకుండా హోం రెమెడీస్ వాడటం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి చలికాలంలో డ్రై స్కిన్ ఉన్న వారు గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలాంటి స్కిన్ కేర్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చలికాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు:
మాయిశ్చరైజర్ రెగ్యులర్‌గా ఉపయోగంచండి:
క్రీమ్ ఎంచుకోండి: చలికాలంలో తేలికపాటి లోషన్‌కు బదులుగా మందపాటి క్రీమ్ ఉపయోగించండి.
తరచుగా ఉపయోగించండి: మాయిశ్చరైజర్‌ను రోజుకు 2- 3 సార్లు ఉపయోగించండి.ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత తప్పకుండా ఉపయోగించండి.
చేతులు, పాదాలపై శ్రద్ధ వహించండి: చేతులు, పాదాలపై చర్మం పొడిగా మారుతుంది. కాబట్టి వీటిపై కూడా మాయిశ్చరైజర్ రాయండి.
వేడి నీళ్లతో స్నానం చేయకూడదు:
చల్లని నీరు: వేడి నీరు చర్మంలోని సహజ నూనెలను దూరం చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని, చల్లటి నీటితో స్నానం చేయండి.
స్నానం చేసే సమయాన్ని తగ్గించండి: ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది.
గాలిలో తేమ: గదిలో హ్యూమిడిఫైయర్‌ను వాడటం వల్ల కూడా గాలిలో తేమ పెరుగుతుంది. ఇది చర్మం పొడిగా మారకుండా నిరోధిస్తుంది.
సన్‌స్క్రీన్ వాడకం: ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి
సూర్యకిరణాలు: చలికాలంలో కూడా సూర్యుని హానికరమైన కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ అప్లై చేయండి.
ఆరోగ్యకరమైన ఆహారం తినండి:
నీరు: తగినంత నీరు త్రాగాలి.
పండ్లు, కూరగాయలు: విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినండి.
ఆరోగ్యకరమైన కొవ్వులు: కొబ్బరి నూనె, బాదం, వాల్‌నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న పదార్థాలను తినండి.
Also Read: ఇలా చేస్తే.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
అదనపు చిట్కాలు:
ఎక్స్‌ఫోలియేషన్: మైల్డ్ స్క్రబ్‌తో వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేట్ చేయండి.
వెచ్చని బట్టలు: చర్మాన్ని వెచ్చగా ఉంచే ఉన్ని దుస్తులను ధరించండి.
హీటర్ల నుండి దూరం: హీటర్లు చర్మాన్ని పొడిగా చేస్తాయి. కాబట్టి దాని నుండి దూరంగా ఉండండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.