BigTV English
Advertisement

World’s Stylish Tiny Home: ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన చిన్న ఇల్లు, ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

World’s Stylish Tiny Home: ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన చిన్న ఇల్లు, ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Stylish Tiny Home: గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా చిన్న గృహాల ట్రెండ్ పెరుగుతూనే ఉన్నది. ఈ ట్రెండ్ ను పట్టుకుని ఓ కంపెనీ మార్కెట్లో అత్యంత ప్రత్యేకమైన, విలాసవంతమైన చిన్న ఇళ్లను నిర్మిస్తున్నది. చూడ్డానికి చిన్నగానే ఉన్నా, కళ్లు చెదిరేలా ఉంటుంది. ధర కూడా దిమ్మతిరిగిపోయేలా ఉంటుంది. ఇంతకీ ఈ ఇళ్ల ప్రత్యేకత ఏంటి? ఎలా నిర్మిస్తారు? ధర ఎంత? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


అత్యంత విలాసవంతమైన చిన్నఇల్లు

2016లో జాక్, ఆండ్రియాస్ అనే సోదరులు ఎస్టోనియన్ కంపెనీని స్థాపించారు. వీళ్లు తక్కువ స్థలంలో అత్యంత విలాసవంతమైన ఇళ్లను నిర్మించాలని భావించారు. ప్రపంచంలో తమ కంపెనీ నిర్మించే ఇళ్లు అత్యంత ప్రత్యేకతను కలిగి ఉండాలని భావించారు. అందులో భాగంగానే ÖÖD గోల్డెన్ ఫాబ్రికేటెడ్ హౌస్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ అద్భుతమైన ఇళ్లను అడవి, ఎడారి, పర్వతాలు ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ ఇల్లు లోపలి నుంచి పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. లోపలి నుంచి చూస్తే పరిసరాలు కనిపిస్తాయి. బయటి నుంచి మాత్రం లోపలి వారిని చూసే అవకాశం ఉండదు. ఈ కంపెనీ ప్రస్తుతం చిన్న ఇళ్లతో పాటు, క్యాబిన్లను 25 దేశాల్లో ఏర్పాటు చేస్తోంది. దాదాపు 600 ఇళ్లను నిర్మించింది. ఈ కంపెనీ రూపొందించే క్యాబిన్లను ఎక్కువగా హాలిడే హోమ్‌లుగా, వెకేషన్ రెంటల్స్ గా, హోటళ్లలో వినియోగిస్తున్నారు. ఈ ఇల్లు పూర్తిగా బంగారు వర్ణం గ్లాస్ తో కప్పబడి ఉంటుంది. ఇంటీరియర్స్ అంతటా కనువిందు చేసేలా బంగారు మెరుగులు అద్దుతతారు. ఈ ఇల్లు కేవలం 283 చదరపు అడుగులలో నిర్మిస్తున్నారు.


బంగారు గాజుతో ఇంటి నిర్మాణం

ఎస్టోనియన్ కంపెనీని నిర్మించే ఇల్లు వెలుపలి భాగం బంగారు గాజుతో ఉంటుంది. ఇది ఇంటికి ప్రత్యేకమైన రూపాన్ని అందిస్తుంది. పగటి పూట సూర్యకాంతితో మరింత అద్భుతంగా మెరిసిపోతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయంలో ఆహ్లాదకరమైన లుక్ ను అందిస్తుంది. ఈ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే బంగారం కాంతితో సంబంధం లేకుండా అన్ని వేళలలో మెరుపులు మెరిపిస్తుంది. లోపలి భాగం బ్రిటీష్ హార్డ్‌ వేర్, లైటింగ్ డిజైన్ కంపెనీ బస్టర్ & పంచ్ తో కలిపి రూపొందించింది. అత్యధునిక  డిజైన్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రికల్ సాకెట్లు, లైట్ స్విచ్‌లు,  క్లోసెట్ హ్యాండిల్స్, వేలాడే బెడ్ లైట్లు ఇంటికి మరింత ఆకర్షణ అందిస్తున్నాయి.  యాంబియంట్ LED లైటింగ్‌ తో కస్టమ్ మేడ్ బిల్ట్ ఇన్ కింగ్ సైజ్ బెడ్, లెదర్ హెడ్‌ బోర్డ్, రెండు బెడ్‌ సైడ్ టేబుళ్లు, క్లోసెట్ ఉంటుంది. ముదురు ఎరుపు క్యాబినెట్‌ తో కూడిన కిచెన్, బియానో ​​ఇమెప్రలే గ్రానైట్, క్వార్ట్జ్ కౌంటర్‌ టాప్‌లు, రిఫ్రిజిరేటర్, గోల్డెన్ సింక్, కాక్‌ టెయిల్ మిక్సర్ ఉంటుంది. ఇంట్లోని ప్రతిదీ బంగారు వర్ణాన్ని కలిగి చాలా లగ్జరీగా ఉంటుంది.

ఒక్కో ఇల్లు ధర రూ. 2 కోట్లు

ఒక్కో  ÖÖD గోల్డెన్ హౌస్ ప్రీ ఫాబ్రికేటెడ్ యూనిట్ ధరను రూ. 2 కోట్లుగా నిర్ణయించారు.  ప్రజలు అరుదైన అనుభూతిని పొందడం కోసం ఈ ఇంటిని కొనుగోలు చేస్తున్నారని జాక్ వెల్లడించారు.

Read Also: ఓ మై గాడ్.. ఎలుకలు కూడా డ్రైవింగ్ చేస్తాయా? ప్రయోగంలో అవి ఏం చేశాయంటే.?

Related News

Gas Burner Cleaning Hacks: గ్యాస్ బర్నర్‌లు జిడ్డుగా మారాయా ? ఈ టిప్స్‌ పాటిస్తే.. కొత్త వాటిలా మెరుస్తాయ్

Underwear: అండర్‌ వేర్ ఉతక్కుండా ఎన్ని రోజులు వాడొచ్చు?

Wrinkles​: ముఖంపై ముడతలా ? ఇవి తింటే.. నిత్య యవ్వనం

Dark Circles: డార్క్ సర్కిల్స్ సమస్యా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Mustard oil For Hair: ఆవ నూనెతో అద్భుతం.. ఇలా వాడితే తల మోయలేనంత జుట్టు

Jeera Water: రాత్రి పూట జీలకర్ర నీరు తాగితే.. ఈ వ్యాధులన్నీ పరార్

Weight Lose: 30 రోజుల వాకింగ్ రిజల్ట్.. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ !

Kidney Damage: కిడ్నీలను నిశ్శబ్దంగా దెబ్బతీసే.. 7 అలవాట్లు

Big Stories

×